విద్యార్థులలో జాతీయ భావం నైతిక విలువలు పెంపొందించాలి
1 min readఏబిఆర్ఎస్ఎం.. సహ సంఘటనా మంత్రి గుంతా లక్ష్మణ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: జాతీయ విద్యా విధానం ద్వారా నేటి విద్యార్థులలో జాతీయ భావం నైతిక విలువలు పెంపొందించాలని భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కృషి చేయాలని ఏ.బి.ఆర్.యస్.యం జాతీయ సహ సంఘటన మంత్రి శ్రీ గుంతా లక్ష్మణ్ అన్నారు.విద్యా రంగ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలనిu పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చార్జి మెమోలు ఇవ్వడం సరికాదని చార్జి మెమోలు ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీ కార్యదర్శి నివేదికను, పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. తదుపరి 2024 నుండి2026 వరకు మూడు సంవత్సరాల పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఆపస్ నూతన రాష్ట్ర కార్యవర్గంఆపస్ రాష్ట్ర కార్యాలయం నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు ఎన్నికల అధికారులుగా జే.పీ శాస్త్రి, టి .రమేష్ బాబులు, ఎన్నికల పరిశీలకులుగా పాలేటి వెంకట్రావు వ్యవహరించారు. ఎన్నికల సమావేశంలో 26 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులురాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతికి చెందిన శవన్న బాలాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవి సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆపస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా సిహెచ్ శ్రావణ కుమార్ ను నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆపాస్ సంపర్క అధికారి పుట్టా శేషు, జాతీయ సహకార్యదర్సి యం.రాజశేఖర్ రావు, 26 జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారు. నూతన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ మాట్లాడుతూ జిపిఎస్ రద్దు కోసం, పాత పెన్షన్ అమల కోసం, ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధన కోసం, ఆర్థిక బకాయిల చెల్లింపు కోసం, 117 జీవో రద్దు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ వి సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల అధికారి జేపీ శాస్త్రి ఈ కార్యవర్గం 2024 జనవరి 1 నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు.