పనస పొడితో అదుపులోకి మధుమేహం.. పరిశోధనలో వెల్లడి
1 min readపల్లెవెలుగు వెబ్: పనస కాయ పొడిలో మధుమేహాన్ని అదుపు చేసే గుణాలు ఉన్నాయని తెలుగు వైద్యులు గుర్తించారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రి లో మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎ. గోపాలరావు తోపాటు మరికొందరు వైద్యులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రం అంతర్జాతీయం జర్నల్ లో ప్రచురితమైంది. పనస కాయ పొడిలో ఫైబర్, మినరల్స్, యాంటీ డయాబెటీస్ గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. చక్కెర వ్యాధి ఉన్న రోగుల మీద సుదీర్ఘ పరిశోధనలు జరపడం ద్వార ఈ అంశాన్ని కనుగొన్నట్టు డాక్టర్ గోపాలరావు తెలిపారు. పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చాక ‘ నేచర్ జర్నల్ ’ కు పరిశోధన పత్రాన్ని సమర్పించనట్టు ఆయన తెలిపారు. పనస పొడిన భోజనం సమయంలో ఒక స్పూన్ తీసుకోవడం ద్వార మధుమేహాన్ని అదుపులోకి తీసుకురావొచ్చని ఆయన వెల్లడించారు.