PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూ పంపిణీతో పేదలకు శాశ్వత ప్రయోజనం…

1 min read

పేద,బడుగు,బలహీన వర్గాల భూములపై సకల హక్కులు కల్పిస్తున్న సీఎం జగన్

ఎట్టిపరిస్థితుల్లోనూ పేదలు భూములను అమ్ముకోవద్దు…

పట్టాల పేరుతో లంచాలు, మామూళ్లు తీసుకునే వారిపై చర్యలు తప్పవు…

ఆలూరు పట్టణం నందు నియోజకవర్గ పరిధిలోని అసైన్ మెంట్ వ్యవసాయ భూమి పట్టాలు మరియు వ్యవసాయ స్వేచ్ఛా సంపూర్ణ భూమి హక్కు పత్రముల పంపిణీ కార్యక్రమం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఏళ్ల తరబడి నుంచి భూమి సాగు చేసుకుని హక్కులు లేని రైతులకు, భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీతో శాశ్వత ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం అన్నారు బుధవారం ఆలూరు పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్ నందు ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు సంబంధించిన అసైన్ మెంట్ వ్యవసాయ భూమి పట్టాలు మరియు వ్యవసాయ స్వేచ్ఛా సంపూర్ణ భూమి హక్కు పత్రముల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో సంబంధించిన తొలివిడతగా అసైన్మెంట్ కమిటీ కి సంబంధించి 712 పట్టాదారులకుగాను 887.11 ఎకరాల విస్తీర్ణపు భూములుకు పట్టాలు అందచేసి,వాటికి సమగ్రమైన రికార్డులతో అందిస్తున్నారన్నారు.మరియు 20సంవత్సరాలు భూమి కొనుగోలు పధకం ఇచ్చిన భూమికు హక్కు కల్పించి సంబంధించిన పట్టాలు SC కార్పొరేషన్ ద్వారా మంత్రి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. భూములకు సంబంధించి 495 మంది పట్టాదారులకు 834.51 ఎకరాల  విస్తీర్ణాన్ని రైతులకు పట్టాలుగా ఇవ్వడం జరిగింది.

పేదల భూ పంపిణీపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు…

గత ప్రభుత్వం పేదలకు భూ పంపిణీపై చొరవ చూపలేదన్నారు.2004-2009 కాలంలో వైఎస్ఆర్ హయాంలో పేదలకు భూపట్టాల పంపిణీ జరిగిందని, తరువాత ఒక ఏడాది భూ పట్టాల పంపిణీ జరిగిందని, తరువాత పంపిణీ జరగలేదన్నారు.ఇప్పుడు జగన్ పాలనలో చారిత్రాత్మకంగా భూపట్టాల పంపిణీ,100సంవత్సరాలు తరువాత రీ సర్వే జరుగుతోందన్నారు అన్ని హక్కులుతో ఇస్తున్న భూములను ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్ముకోరాదన్నారు.పట్టాలు పొందువారు అధికారులు కు గానీ, సిబ్బందికి గానీ, దళారులుకు గానీ ఏ ఒక్కరికీ లంచాలు కానీ మామూళ్లు ఇవ్వనవసరం లేదన్నారు.

పేదల పక్షపాత ప్రభుత్వం…

నిరుపేదలకు సంక్షేమం,అభివృద్ధి, ఆశ్రయం లను కల్పించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఇది పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు. సచివాలయ,వాలంటరీ వ్యవస్థలతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు.నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మారాయన్నారు.బడుగు,బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట…      బడుగు,బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.పార్టీ పదవుల్లో సైతం అగ్రస్థానం కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి  హోళగుంద మండల ఎంపీపీ తనయుడు ఈసా, పత్తికొండ రెవెన్యూ విభాగపు అధికారి శ్రీమతి ఎన్.రామలక్ష్మి ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ,మండల జడ్పీటీసీ ఏరూరు శేఖర్,ఎంపీపీ శ్రీమతి జి.రంగమ్మ,అన్ని మండలా కన్వీనర్లు,ప్రజాప్రతినిధులు, పలువురు జడ్పీటీసీ సభ్యులు రెవెన్యూ,అధికారులు,వైస్సార్సీపీ కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author