ఉయ్యాలవాడలో గడప గడపకు మన ప్రభుత్వం..
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలను భాగంగా బుధవారం నాడు, పాణ్యం ఎమ్యెల్యే మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పాణ్యం,ఓర్వకల్ మండలం:ఉయ్యాలవాడ గ్రామంలో గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎమ్యెల్యే కాటసాని గడపకు వెళ్లి రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న జనరంజక పాలన,అవినీతి రహిత పాలన గురించి ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ చైర్మన్ మీది వేముల ప్రభాకర్ రెడ్డి. జడ్పిటిసి రంగనాథ్ గౌడ్. లోటర్ భాష. పలువురు గ్రామ,మరియు మండల ప్రజాప్రతినిధులు(జడ్పీటీసీ,ఎంపీపీ,సర్పంచులు, ఎంపిటిసిలు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.