NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండలానికి ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి 

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమములో బాగముగా క్రికెట్, బ్యాట్మెంటన్,వాలీబాల్, కోకో , కబడ్డీ తదితర క్రీడా పోటీల సామగ్రిని మండల అధ్యక్షులు,  చీర్ల సురేష్ యాదవ్  చేతులమీదుగా మండల పరిషత్ కార్యాలయము, చెన్నూరు నందు ఆయా సచివాలయములకు గురువారం పంపిణీ చేయడము జరిగినది, ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణ నందు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము  ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమమును అందరూ సచివాలయ సిబ్బంది  షెడ్యూల్డ్ మేరకు విజయవంతం చేయాలని కోరారు,  అలాగే ఈ కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించి 15 సంవత్సరముల పైబడిన యువతి యువకులు ఈ క్రీడాపోటీలలో పాల్గొనేటట్లు చేయవలయునని ఆయన తెలిపారు,  మండలము నందు ఆడు క్రీడా కారులు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వెళ్లవలయునని ఆశాభావం వ్యక్తం చేశారు, తద్వారా  శాసన సభ్యులు  పి.రవీద్రనాధ రెడ్డి కోరిక మేరకు మన మండలమునకు మంచి పేరు తీసుకురావలయునని ఆయన క్రీడాకారులను అలాగే అధికారులను కోరారు, ఈ కార్యక్రముములో యం.పి.డి.ఓ  డి. సుబ్రహ్మణ్యం శర్మ, ఏ.ఓ  బి.శకుంతల గా సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author