దత్తత స్వీకరణ నియమనిబంధనప్రకారం చట్టబద్ధంగా స్వీకరించాలి..
1 min readఅనాధికార దత్తత స్వీకరణ నిషేదం..
దత్తత పిల్లల సంరక్షణ-విద్యాభివృద్ది దత్తత తల్లిదండ్రులు కృషి చేయాలి..
జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అనాధ బాలలను పిల్లలు లేని తల్లిదండ్రులకు దత్తతఇచ్చే ప్రక్రియలో నియమనిబంధనలకు అనుగుణంగా చట్టబద్దంగా దత్తత స్వీకరణ జరుగుతుందని జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రాష్ట్ర దత్తత వనరుల సంస్ధ మరియు జిల్లా మహిళా అభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన దత్తత ప్రక్రియపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.ఎల్. పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్ లావణ్యవేణి ముఖ్య అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో అనాధబాలలను శిశు గృహాలద్వారా సంరక్షించబడి పిల్లలులేని తల్లిదండ్రులకు దత్తత నియమనిబంధనలకు అనుగుణంగా వారికి దత్తత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దత్తత చేసుకున్న పిల్లల భవిష్యత్, సంరక్షణ తల్లిదండ్రులపై ఉందని వారికి విద్యావకాశాలు కల్పించి వారిని తీర్చిదిద్ధవలసిన బాధ్యత దత్తత తీసుకున్న వారి తల్లిదండ్రులపై ఉందన్నారు. దత్తత తీసుకొనే తల్లిదండ్రులు ఆన్ లైన్లో ధరఖాస్తు చేసుకోవాలని ఆ ధరఖాస్తును పోలీసు శాఖవారి ద్వారా పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా దత్తత ప్రక్రియపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి జిల్లా దత్తత వనరుల సంస్ధ మరియు మహిళాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రిసోర్స్ పర్సన్స్ గ్రామాలు, జిల్లా, రాష్ట్రాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనాధికార దత్తత తీసుకున్న వారి సమాచారాన్ని వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి పోలీస్ 100 లేదా సంబంధిత అధికారులకు తెలియపరిచినవెంటనే ఆ బాలలను రక్షించి బాలల సంక్షేమ సమితి ముందు ప్రవేశపెట్టి వారి ఆదేశాల మేరకు శిశుగృహ మరియు బాలల రక్షిత గృహాలలో సంరక్షణ కల్పించి తరువాత ప్రత్యేక దత్తత సంస్ధ ద్వారా కారా న్యూఢిల్లీ వారి దత్తత నిబంధనల ప్రకారం దత్తత ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో కారా సంస్ధ న్యూఢిల్లీ ఛీఫ్ కన్సాల్టెంట్ అనూషశర్మ మాట్లాడుతూ పిల్లలను దత్తత పొందుటకు కావల్సిన అర్హతలను,పిల్లల కొరకు దత్తత చేసుకొనే విధానం మరియు పాటించాల్సిన నియమనిబంధనలు, చైల్డ్ మ్యాచింగ్ ప్రక్రియ, అనాధికార దత్తత స్వీకరణ నిషేదం, కేసులు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లాకు చెందిన దత్తత తీసుకున్న ఒక తల్లి దేవకుమారి మాట్లాడుతూ తన కుమారుడు 19 సంవత్సరాల వయస్సులో యాక్సిడెంట్ లో మృతిచెందాడని దాంతో తాను తన భర్తచాలా కృంగిపోయామన్నారు. ఒక సమయంలో అయితే చాలా డిప్రెషన్ కు లోనయ్యామన్నారు. ఆసమయంలో తమ స్నేహితులు, బంధువులు ఎవరినైనా దత్తత తీసుకోమని చెప్పియున్నారని ఆమేరకు వెంటనే ఒక పాపను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. ఆపాపే తమకు కుమారుడు, కుమార్తెగా ఉంటూ కొడుకులేని లోటు తీరుస్తుందన్నారు. అశ్విని మాట్లాడుతూ తన తల్లిదండ్రులు లేనప్పుడు ఎంతో బాధకు గురైనానని అయితే ఇప్పుడు తనకు ఆ బాధలేదని ఎందుకంటే తనకు ఏది అవసరమైన అది అడగకుండా నన్ను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తీరుస్తున్నారు. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆశ్విని చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ బి. వసంతబాల, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కె. ఉమారాణి, ఏడి శ్రీలక్ష్మి, ఎపిఎస్ సిపిసిఆర్ సభ్యులు జె. రాజేంధ్రప్రసాద్, జిల్లా అడిషనల్ ఎస్పీ జె.భాస్కర్ తదితరులు పిల్లల దత్తత ప్రక్రియ , దత్తత పిల్లలకోసం అప్ లోడ్ చేయవలసిన పత్రాలు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు దత్తత కొరకు చెల్లించవలసిన రుసుము, దత్తత అంటే ఏమిటి పిల్లలను దత్తత పొందుటకు కావాల్సిన అర్హతలు, దత్తత తీసుకుంటున్న తల్లిదండ్రుల వయస్సు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముందు జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి, కారా సంస్ధ న్యూఢిల్లీ ఛీఫ్ కన్సాల్టెంట్ అనూషశర్మ, జిల్లా అడిషనల్ ఎస్పీ జె.భాస్కర్, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్దినీలు భరతనాట్యంతో స్వాగత ప్రదర్శన చేశారు. తదుపరి దత్తత స్వీకరణ ప్రక్రియపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ స్కీమ్ అధికారి గిరిజ, సి డబ్ల్యూసి చైర్ పర్సన్ ఆర్. రాణి, డిసిపిఓ సిహెచ్ సూర్యచక్రవేణి, ప్రోగ్రాం మేనేజరు స్వాతి, స్టేట్ ఆఫీసరు సిబ్బంది సురేఖ, విజయలక్ష్మి , రాష్ట్రంలోని అన్ని జిల్లాల డిసిపివోలు, పోటెక్షన్ అధికారులు, శిశుగృహ మేనేజర్లు, సోషల్ వర్కర్లు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, దత్తతకు ధరఖాస్తుచేసుకున్న తల్లిదండ్రులు, ఏలూరు జోన్ పిడిలు, సిడిపిఓలు, సూపర్ వైజర్లు, అంగన్ వాడీ సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.