పర్యాటకులను ఆకట్టుకునేలా.. ‘టూరిజం’ రూపురేఖలు..!
1 min readపర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ డి.వి. చంద్ర మౌళి రెడ్డి
పల్లెవెలుగు: ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పర్యాటన కేంద్రాలను ( టూరిజం) అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు అనుగుణంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తుందన్నారు పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ డి.వి. చంద్ర మౌళి రెడ్డి. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు రాక్ గార్డెన్, గార్గేయపురం చెరువుపై బార్ అండ్ రెస్టారంట్, బోటింగ్, శ్రీశైలం, అహోబిళం, మహానంది, బెల్లంగహాలు , అనంతపురం జిల్లాలో లేపాక్షి తదితర పుణ్యక్షేత్రం పరిధిలోని పర్యాటన కేంద్రాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం ప్రాంతాలను రూపొందించామన్నారు. దేశవిదేశాల నుంచి వచ్చే యాత్రికులకు, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించి… పర్యాటకుల సంఖ్యను పెంచేలా టూరిజం శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ డి.వి. చంద్రమౌళి రెడ్డి వెల్లడించారు.