PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీజీబీ సేవలు ఉపయోగించుకోండి

1 min read

– చైర్మన్​ రాకేష్​ కశ్యప్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో సేవలు విరివిగా వినియోగించుకోవాలని చైర్మన్​ రాకేష్​ కశ్యప్​ వినియోగదారులకు సూచించారు. బుధవారం నగరంలోని వెంకటరమణ కాలనీ శాఖను నూతన భవన ప్రాంగణంలోకి మార్చారు. ఈ సందర్భంగా రిబ్బన్​ కట్​ చేసి ..నూతన భవనంలోకి ప్రవేశించిన చైర్మన్​ రాకేష్​ కశ్యప్​ బ్యాంకు ద్వారా అభివృద్ధి పథకాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశాలను క్షుణ్ణంగా వివరించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష , YSR చేయూత, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఖాతాదారుల అవసరార్థం ఏటీఎంలను పెంచుతామని, అన్ని బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏకైక బ్యాంకు తమదేనన్నారు. కార్యక్రమంలో కర్నూలు రీజియన్ R. M P. ఓబయ్య, కర్నూలు రీజియన్ ఆఫీస్ సిబ్బంది, మరియు V. R. కాలనీ బ్రాంచి manager మరియు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.


About Author