PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆసుపత్రిలో వైద్య సేవలు అమోఘం..

1 min read

అత్యాధునిక పరికరాలు అందుబాటులో -వైద్యులను అభినందించిన ఎమ్మెల్యే ఆర్థర్

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అమోఘమని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అన్నారు.శుక్రవారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని సిహెచ్ సి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మరియు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆర్థర్ హాజరయ్యారు.వైద్యులు ఆయనకు పూల బోకేలతో ఘనస్వాగతం పలికారు.అనంతరం పేషంట్లతో ఎమ్మెల్యే మాట్లాడారు.ప్రతి గదిని ఆయన పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు.రోజుకు ఎంత మంది ఓపి వస్తున్నారంటూ ఓపి రిజిస్టర్ ను ఎమ్మెల్యే పరిశీలించారు.పేషంట్ల విశ్రాంతి గది మరియు 40 లక్షల అత్యాధునిక పరికరాలతో ఉన్న గదిని ఎమ్మెల్యే ప్రారంభించారు.అనంతరం ప్రతి పరికరాల గురించి అడిగారు.తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరగగా ఆస్పత్రి సూపరింటెండెంట్ వైద్యులు తిరుపతి మాట్లాడుతూ ఆసుపత్రికి కావలసిన వాటి గురించి సమావేశంలో తెలిపారు.గతంలో ఇక్కడ ఐదు మంది సిబ్బంది మాత్రమే ఉండేవారని ప్రస్తుతం 40 మంది సిబ్బంది ఉన్నారని ఆయన అన్నారు.చిన్న వయసులో ఉన్న వారికి కూడా గుండెపోటు వస్తుందని అలా వచ్చినవారికి ఇక్కడ 40 వేల రూపాయలు విలువచేసే ఇంజక్షన్ ద్వారా రెండు గంటల పాటు గుండెపోటును అదుపులో ఉంచవచ్చని డాక్టర్ తిరుపతి అన్నారు.తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రకాల వైద్యులు మరియు సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రుల మాదిరిగా తయారు చేసిందని అన్ని రకాల వ్యాధులకు ఇక్కడ చికిత్స అందించడం అంతే కాకుండా వైద్య సేవలు చాలా బాగా ఉన్నాయని ఆస్పత్రి శుభ్రంగా ఉండడం పట్ల వైద్యులను మరియు సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు.వైద్యులు మరియు ఉపాధ్యాయులు చేసే సేవ వెలకట్టలేనివని ఆస్పత్రి అభివృద్ధి పనులకు అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఆర్థర్ పనులకు సమ్మతించారు.ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు వంగాల సిద్ధారెడ్డి,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ ప్రకాష్ బాబు,ఎస్ఐ జగన్ మోహన్ మరియు వైద్యులు వంశీకృష్ణ,భరత్ కుమార్,శారద,మధు నాయక్,ల్యాబ్ టెక్నీషియన్లు సత్యనారాయణ,జబీన,ఆరోగ్య మిత్ర కరీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author