క్రీడా ప్రతిభ వెలికి తీయడానికే ఆడుదాం ఆంధ్రా.!
1 min readమున్సిపల్ కమిషనర్ కిషోర్.
డిసెంబర్ 13 లోపు క్రీడాకారులు తమ పేరు నమోదు చేసుకోవాలి .
మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి శోభారాణి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా -2023 క్రీడలను సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించబోతున్న నేపథ్యంలో నందికొట్కూరు మండలంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ,జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులకు పట్టణం లోని స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరం లో సంసిద్ధత సమావేశం నిర్వచించారు. ఎంపీడీఓ శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ , మండల విద్యా శాఖ అధికారిణి ఫైజున్నిస బేగం హజరయ్యారు. నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ కిషోర్ మాట్లాడుతూ యువత లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు ఉపయోగ పడతాయని తెలిపారు. ఎంపీడీఓ శోభారాణి మాట్లాడుతూ 15 సంవత్సరాలు పైబడిన పురుషులు, మహిళలు క్రీడల్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ నమోదు ప్రక్రియ లో వార్డు వాలంటీర్లు చురుకుగా పాల్గొనాలని కోరారు. మండల విద్యా శాఖ అధికారిణి ఫైజున్నిస బేగం మాట్లాడుతూ మండలం లోని వ్యాయామ ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో క్రీడాకారుల రిజిస్ట్రేషన్, క్రీడల నిర్వహణ, సంబంధిత క్రీడల్లో సచివాలయ సిబ్బందికి శిక్షణ, మౌళిక వసతులు,కమిటీల ఏర్పాటు, విధి విధానాలు మరియు ముఖ్య అంశాలపైన చర్చించారు. సమావేశంలో నంద్యాల కర్నూలు జిల్లాల శాప్ కో- ఆర్డినేటర్ లు స్వామిదాసు రవి కుమార్, శ్రీనాథ్ పెరుమాళ్ళ , నియోజక వర్గ ఇంఛార్జి డోరతి, మండల ఇంఛార్జి వీరన్న, జూనియర్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ రియజుద్దిన్, ఫిజికల్ డైరెక్టర్ లు విజయ కుమారి,రాజేశ్వరి,సరస్వతి, పద్మ లత, రామ కృష్ణ, సుంకన్న, రాగన్న తదితరులు పాల్గొన్నారు.