PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది..

1 min read

– జి జి హెచ్ సూపర్హింటెంట్ ఆర్గనైజ్ విజయ

– ఆర్ టి ఏ సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లేని సమాజం కోసం ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆగ్నెస్ విజయ అన్నారు. ఏలూరు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నిర్ములన మరియు ఏ.ఆర్.టి. చికిత్స పై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపరింటెండెంట్ డాక్టర్ ఆగ్నెస్ విజయ, ఆర్.ఎం.ఓ డాక్టర్ ప్రసాద్ రెడ్డి, ఏ.ఆర్.టి సెంటర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘువీర్ త్యాగి, పడీయాట్రషన్ డాక్టర్ పి. శ్రీనివాస్ హజారయ్యారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆగ్నెస్ విజయ మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లేని సమాజం కోసం ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందని అన్నారు. హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాధితులకు ఏ.ఆర్.టి సేవలు ఉచితంగా అందిచబడుతున్నాయని, కావున బాధితులు వ్యాధిని గురించి చింత పడకుండా వైద్యుల సలహా మేరకు ఏ.ఆర్.టి చికిత్స క్రమంగా తీసుకోవాలని తెలిపారు. ఏ.ఆర్.టి చికిత్స తీసుకుంటున్న వారికీ ఉచితముగా సి.డి. మరియు వైరల్ లోడ్ పరీక్షలు కూడా చేయటం జరుగుతుందని అన్నారు. అలాగే నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికీ ప్రభుత్వము ప్రతి నెల ఏ.ఆర్.టి. పెన్షన్స్ నేరుగా తమ బ్యాంకు ఖాతాకు జమ చేయటం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం సుమారు 200 రోగులకు పౌష్టికాహారాన్ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో ఏ. ఆర్. టి వైద్య సిబ్బంది మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ యు.వి.శాస్త్రి, డాక్టర్ జె.బి. ఫ్లోరెన్స్, డాక్టర్ కె.జగదీశ్వరరావు డేటా మేనేజర్స్. సి. హెచ్.శామ్యూల్ క్రిస్టఫర్ వి.హరి బాబు, కౌన్సిలర్స్ హర్డ్ వర్జన్, మేరీ జాన్ ప్రసాద్, స్టాఫ్ నర్స్ సుధా దేవి. కేర్ కోఆర్డినేటర్ రవితేజ ల్యాబ్ టెక్నిషన్స్ అశ్విని కుమార్, బి.రాఘవేంద్రరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author