బహుభాషా అంతర్జాతీయ సదస్సు గ్రంథం ఆవిష్కరణ..
1 min readకస్పాండెంట్ మదర్ ఎర్నీ స్టైన్ ఫెర్మెండైజ్
ఎగ్జామినేషన్ సిస్టర్ అధ్యాపకులను అభినందించారు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక సెయింట్ థెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో నిర్వహించిన ప్రవాసీ సాహిత్యం భిన్న దృక్పదాలు అనేఅంశంపై 66 మంది రచయితలు రచించిన బహుభాషా అంతర్జాతీయ సదస్సు గ్రంధాన్ని కళాశాల సుపీరియర్ అండ్కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్టైన్ ఫెర్నాండెజ్ ఆవిష్కరించారు. థెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల మరియు గీనా దేవి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాఫీ సాహిత్యం విభిన్న దృక్పదాలుఅనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. సదస్సులో 96 మంది అధ్యాపకులు, పరిశోధకులుమరియు స్నాతకోత్తర విద్యార్థులు పత్ర సమర్పణ గావించారు. వారి పత్రాలను బోహల్ శోధ్ మంజూష పత్రిక లో ప్రచురించారు. అంతర్జాతీయ సదస్సును కళాశాల ప్రిన్సిపల్ సిస్టెర్ మెర్సీ ఆధ్వర్యంలో కళాశాల హిందీ తెలుగువిభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి, అధ్యాపకులు అరుణ ఝాన్సీ రాణి, డాక్టర్ కే అరుణ, ఎన్ భవానీలు నిర్వహించారు. నిర్వాహకులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ మరియ క్రిష్టియా మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టర్ సుశీల అధ్యాపకులు అభినందించారు.