మామిడి రైతులకు శిక్షణా కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మామిడి తోటల సస్యరక్షణపై రైతులు అవగాహన కలిగి ఉండాలని ఉధ్యానాధి కారిని జ్యోతిర్మయి అన్నారు, శుక్రవారం మండలంలోని గుర్రంపాడు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన మామిడి రైతుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మామిడి తోటల సస్యరక్షణ చర్యలపై రైతులకు పూర్తి అవగాహన కలిగి ఉండేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమానికి కె వి కే సైంటిస్ట్ డాక్టర్ మానస, వ్యవసాయాధికారిని కె. శ్రీదేవి , గుఱ్ఱంపాడు సర్పంచ్ సీ.ప్రమీల , వ్యవసాయ విస్తరణ అధికారి ఇందిరా పాల్గొని రైతులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా రైతులకు మామిడి తోటలలో యాజమాన్య పద్ధతులు పురుగుల,తెగుళ్ల నివారణ గురించి Dr. మానస అవగాహన కల్పించడం జరిగింది, అలాగే రైతులు అడిగిన ప్రతి సందేహానికి డాక్టర్.మానస సమాదానం ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కలుపు నివారణతొలకరిలో లోతు దుక్కులు, చేసుకోవాలని,పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలనిఅక్టోబర్, నవంబర్లో పైపైన దుక్కులు (రోటోవేటర్) చేసుకోవాలని రైతులకు సూచించారు,పూత, పిందే సమయంలో జాగ్రత్తలు పాటించాలని డిసెంబర్, జనవరిలో పూత సమయం కాబట్టి తెల్ల పూత దశలో పురుగుమందుల పిచ్చికారి చేయకూడదు, ప్లానోఫిక్స్ -1ml/4.5lt లేదా NAA 20ppm 1గ్రా/50లీ చేయాలి, పూమొగ్గ విచ్చుకోవడానికి 13-0-4510గ్రా./లీ,పింద పెరిగే దశలో యూరియా 5గ్రా. మరియు 13:0:45 -10 గ్రా.పిచికారీ చేయాలి.వేప నూనె ప్రతి 2 నెలలకు ఒకసారి పిచికారీ చేయాలని ఆమె రైతులకు తెలిపారు,ఉద్యానాధికారిని K. జ్యోతిర్మయి మాట్లాడుతూ, రైతులు మట్టి పరీక్ష చేసుకోవాలని, మామిడి పూత బాగా రావడానికి , సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఉద్యాన రైతులందరు కలిసి FPO (గ్రూపుగా ఏర్పడి మండలంలో కలక్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు, దీని కి గాను ఉద్యానశాఖ నుంచి 75% రాయితీ కల్పిస్తామని ఆమె తెలియజేశారు. వ్యవసాయాధికారిని శ్రీదేవి మాట్లాడుతూ’, ట్రైకోడర్మ విరిడి,సూడో మోనాస్ వినియోగం గురించి వాటి లాభాల గురించి వివరించారు, నువ్వులు ,వేరుసెనగ పంటల్లో సూటి ఎరువులు అయిన సింగిల్ ఫాస్ఫేట్ ని వాడడం ద్వారా నూనె శాతం పెంచుకోవచ్చని తెలియజేయడం జరిగింది. రబీ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని ఆమె రైతులకు చెప్పడం జరిగింది.