నవరత్నాలతో గ్రామాలకు మహర్ధశ
1 min readసచివాలయాలతో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు పుచ్చకాయల మాడ గ్రామ పంచాయతీలో నవరత్నాలు,వివిధ అభివృద్ధి పనులు 17కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్య,వైద్య రంగానికి పెద్ద పీట వేస్తూ, గ్రామస్థాయిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని ఎంపీపీ నారాయణదాసు,వైసిపి జిల్లా కన్వీనర్ శ్రీ రంగడు,మాజీ సర్పంచ్ సోమ శేఖర్ అన్నారు.శనివారం పుచ్చకాయల మాడ గ్రామపంచాయతీలలో నవరత్నాల ద్వారా జరిగిన అభివృద్ధి పనులను లబ్ధి దారులకు వివారించారు. గ్రామంలో రూ 17 కోట్ల నిధులతో వివిధ పథకాలు, అభివృద్ది పనులను సచివాలయం వ్యవస్థ ద్వారా అమలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసిపి నాయకులతో కలిసి వైసిపి జెండాను ఆవిష్కరించారు . ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి?అనే కార్యక్రమంలో నాయకులు పాల్గొని వైఎస్ఆర్ పార్టీ జెండాను, సచివాలయంలో సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. జగన్మోహన్ రెడ్డి తోనే భావితరాలకు బంగారు భవిష్యత్తు సాధ్యమని పేర్కొన్నారు.దేశంలో మరి ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని,దీంతో గ్రామాలకు మహర్ధశ పత్తనుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు మోహన్, రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.