PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

8 నుండి అంగన్ వాడీ కార్మికుల సమ్మె:ఏఐటీయూసీ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమస్యల పరిష్కారానికీ వేతనాల పెంపుకై డిసెంబర్  8 నుండి ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరవధిక సమ్మెను అంగన్వాడీ కార్మికులు జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వి రఘురాం మూర్తి,ఎం.రమేష్ బాబు పిలుపు నిచ్చారు.కడుమూరు సెక్టార్ అంగన్వాడీ కార్మికుల సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ,సీఐటీయూ,ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్లు కలిసి డిసెంబర్ 8నుండి సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు.గత 48 సంవత్సరాల నుండి  స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు సేవలు ఉద్దేశాలు నెరవేర్చి గర్భవతులు,బాలింతలు 6 సంవత్సరాల లోపల పిల్లలకు  సేవలు చేస్తున్నామని పాలక ప్రభుత్వాలు అంగన్వాడీ కార్మికులకు గౌరవ వేతనం పేరుతో వెట్టిచాకిరి చేయించుకుంటూ వర్కర్లకు 11,500,మినీ వర్కర్లకు 7వేలు, హెల్పర్లకు 7వేలు రూపాయలు ఇవ్వాలని అన్నారు.మినీ టీచర్లు అందర్నీ మెయిన్ టీచర్ గా వెంటనే గుర్తించాలని,విధులల్లో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని,ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,ఈ ప్రధానమైన సమస్యలను పరిష్కారం చేసేదాకా డిసెంబర్ నెల 8వ తేదీ నుండి సమ్మెలో వెళ్తున్నామని కార్మికులు యూనియన్ నాయకులు సమిష్టిగా జయప్రదం చేయాలని వారు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమం లో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు,సరోజ,భాగ్యమ్మ, ఇందిరా,జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author