NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీ కెనాల్‌ అధికారులను సన్మానించిన రైతులు

1 min read

పల్లెవెలుగు  వెబ్ గడివేముల :  పంట పొలాలు ఎండిపోతున్న సమయంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు పదిరోజుల పాటు కేసీ కెనాల్‌కు సాగునీరు అందించిన అధికారులను రైతులు సన్మానించారు.మండలంలోని గడిగరేవుల,తిరుపాడు,కొరమద్ది గ్రామాలకు చెందిన రైతులు శనివారం కేసీ కెనాల్‌ కార్యాలయానికి వెళ్లారు.చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించిన ఈఈ తిరుమలేష్‌ రెడ్డి,డీఈ సుబ్రమణ్యం రెడ్డి,జేఈలు విజయ్‌ కుమార్, రాధ కృష్ణలకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంటలు అవసరమైన సాగునీరు అందించడంతో దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రామ్మోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు హరినాథ్‌ రెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి,సురేంద్ర నాథ్‌రెడ్డి,రమణమూర్తి, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author