మత్స్యకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి
1 min readరాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలోని మత్స్యకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వినతులు సమర్పించడానికి వచ్చిన మత్స్యకారులకు సూచించారు. ఆదివారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలోని మత్స్యకారుల నుండి రాష్ట్రం మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వినతులు స్వీకరించారు, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులు సంక్షేమ కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అర్హులైన వారందరూ ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు జాతీయ మత్యకారుల సంఘం ప్రెసిడెంట్ మరియు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలలోని మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారుల పిల్లల విద్యాభ్యాసం కొరకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మత్స్యకారులకు ఉచితంగా నాణ్యత కలిగిన చేప పిల్లలను అందించాలని, ఉచితంగా వాహనాలను అందించాలని, సాంప్రదాయ మత్స్యకారుల కొరకు యూనివర్సిటీలలో ఫిషరీస్ కోర్సులు ఏర్పాటు చేయాలని, అవకాశం ఉన్నచోట చేప పిల్లలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు కల్పించాలని, బెస్త కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలని, చెరువులు, కుంటలు దురాక్రమనకు గురి కాకుండా కాపాడాలని, రాయలసీమలో బెస్త వారికి వేట నిషిద్ధ సమయములు వేట నిషిద్ధ భృతిని కల్పించాలని, నంద్యాల జిల్లాలోని గని గ్రామం లో గత ఆరు సంవత్సరాల క్రితమే 240 ఎకరాలు విస్తీర్ణం గల MIN ట్యాంకును నిర్మించడం జరిగింది. ఆ ట్యాంకును మత్స్యకారుల సొసైటీ కి అనుసంధానం చేసి అందులో 95 మంది సభ్యులకు మా సొసైటీలో సభ్యత్వం కల్పించి మా వృత్తిని మళ్లీ కొనసాగించేలా అవకాశం కల్పించాలని కోరుతూ గని గ్రామ బెస్త తెలుగు గంగపుత్ర సంక్షేమ సంఘం వారు వినతులను సమర్పించారు. వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి వినతిదారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి,కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్, కర్నూలు, నంద్యాల ఫిషరీస్ డిడి.లు శ్యామలమ్మ, రాఘవరెడ్డి, మత్స్య శాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.