PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రోత్సహం

1 min read

: జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉండి వారికి అవసరమైన ప్రోత్సహం అందజేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.ఆదివారం స్థానిక రాజ్ విహార్ కూడలిలోని డా.బిఆర్.అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన 64వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధులు సంక్షేమ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, మేప్మా పిడి నాగశివలీల, విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా, డిఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులలో ఉన్న అసాధారణమైన ప్రతిభ ఆధారంగా వీరిని దివ్యాంగులకు బదులుగా విభిన్న ప్రతిభావంతులని అని పిలవడం జరుగుతుందన్నారు. అందుకు గాను విభిన్న ప్రతిభావంతులలో ఉన్న అసమానమైన ప్రతిభను పెంచుకుంటే విభిన్న ప్రతిభావంతులు కూడా అందరితో సమానంగా ఉండడమే కాక భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా ఎవరికైనా బియ్యం కార్డు లేని వారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే కొత్త బియ్యం కార్డు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన వీల్ చైర్స్ ను సమకూర్చేందుకుగాను ఐఓసీఎల్ సిఎస్ఆర్ నిధుల క్రింద 15 లక్షల రూపాయలను తీసుకోవడం జరిగిందని విభిన్న ప్రతిభావంతుల ప్రాంతీయ కార్యాలయం నుండి అనుమతులు రాగానే అవసరం ఉన్నవారికి వీల్ చైర్స్ అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గత నాలుగు రోజుల కింద భవిత సెంటర్ల లోని విద్యార్థులకు క్రీడలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరం ఉన్నవారికి టాబ్స్ ని కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు అంతేకాకుండా భవిత సెంటర్లో లేని వారికి కూడా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రానున్న రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని అందుకు మీలో చాలా మంది 18 సం.లు దాటిన వాళ్లు ఉంటారని అందుకుగాను జనవరి 1వ తరువాత 18 సం.లు దాటిన వారిని భావి ఓటర్లు (Prospective Voters) అని అంటారు. అలాంటి వారు ఫార్మ్-6 ద్వారా దరఖాస్తు సమర్పించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. అందుకుగాను డిసెంబరు 2,3 తేదిలలో కొత్తగా వచ్చిన వారికి ఓటు హక్కు కల్పించడం, ఎలక్ట్రోల్ రోల్ లో తప్పులు తదితర వాటిని ప్రత్యేక క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేకంగా పిడబ్ల్యుడి అనే ఆప్షన్ ను మార్క్ చేసినట్లయితే ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు సంబంధిత ఎన్నికల సిబ్బంది వచ్చి మీకు ఓటు హక్కు కల్పించి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు.మెప్మా పీడీ నాగశివలీల మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల వారిలో ఉన్న లోపాలను అధిగమించి అందరితో సమానంగా జీవించే హక్కు ఉంటుందన్నారు. వీరు ఆర్థికంగా ఎదగడానికి గాను సుమారు 16 గ్రూపుల వరకు ఉన్నాయన్నారు. అందుకుగాను మీకు అవగాహన కల్పించేందుకు గాను అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతులలో చాలా మంది విద్యావంతులు ఉన్నారని వారిని బుక్ కీపర్స్ గా నియమించుకోవాలని సభ్యులు కోరిన అంశంపై పరిశీలిస్తామన్నారు.సమావేశ అనంతరం విభిన్న ప్రతిభావంతులలో ఉత్తమ సేవలు అందించిన వారిని, అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన వారికి జాయింట్ కలెక్టర్, విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా, డిఎస్పీ మహబూబ్ బాషా దుశాలువ, మెమెంటోతో బహూకరించారు.అంతకుముందు కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ కూడలిలో ఉన్న డా. బిఆర్.అంబేడ్కర్ భవన్ నిర్వహించిన ర్యాలీని నగర మేయర్ బివై.రామయ్య, కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ విజయ మనోహరి, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వీ మోహన్ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.కార్యక్రమంలో స్టేట్ అడ్వైజరి బోర్డ్ కమిటీ ప్రెసిడెంట్ డా.రమేష్, విభిన్న ప్రతిభావంతులు అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.వినోద్, సెక్రెటరీ బి.రామాంజనేయులు, జనరల్ సెక్రెటరీ బి.అనిల్ కుమార్, ఎల్ఎల్సి మెంబర్ రజమనెమ్మ, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author