తెలంగాణ లో కెసిఆర్ కు పట్టిన గతే ఏపీ లో జగన్ కు పట్టడం ఖాయం
1 min readమంత్రాలయం నియోజకవర్గంలో పాలకుర్తి తిక్కారెడ్డి నీ గెలిపించే బాధ్యత మీది
పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగిన, డబ్బులు ఇస్తే టికెట్ వస్తుంది అనుకున్నా ప్రయోజనం లేదు
వచ్చే ఎన్నికల్లో తిక్కారెడ్డి గెలుపు కోసం నేను కూడా మంత్రాలయంలో ఉండి కష్టపడి పని చేస్తా
ఇప్పటికే బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో 38 వేలు కుటుంబాలను కలిశారు ఇంకా కష్టపడి పనిచేయాలి
స్థానిక వైసిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఇక ఇంటికే
ప్రజలే తిక్కారెడ్డిని ఆదరిస్తారు
మంత్రాలయంలో అబోడే హోటల్లో జరిగిన ముఖ్యమైన నాయకులు క్లస్టర్ ఇన్చార్జిల సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : తెలంగాణ లో కేసిఆర్ కు పట్టిన గతే ఏపి లో జగన్ కు పట్టడం ఖాయమని రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలందరూ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోమ్మిరెడ్డి పట్టాభి రామ్ అన్నారు. ఆదివారం మంత్రాలయం లో అబోడే హోటల్లో మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమైన నాయకులు, క్లస్టర్ ఇన్చార్జిల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం లో ఇప్పటివరకు 38 వేలు కుటుంబాలను కలిశారు చాలా బాగా పనిచేశారు ఇంకా కష్టపడి పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కొంతమంది నాయకులు టికెట్ కోసం పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగిన, డబ్బులు ఇస్తే టికెట్ వస్తుందిలే అనుకుంటే పొరపాటు అని ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తికే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందని తెలిపారు. మంత్రాలయంలో ఎలాంటి అపోహలు నమ్మకండి అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పాలకుర్తి తిక్కారెడ్డి ఉంటాడు అని పాలకుర్తి తిక్కారెడ్డి గెలుపు కోసం నేను కూడా త్వరలో 4 మండలాల్లో ఇక్కడే ఉండి పనిచేస్తానని తెలిపారు. ఇప్పటినుంచి మనం చేయాల్సింది ప్రతి కుటుంబాన్ని ప్రతి గ్రామంలో అందరిని కలుపుకొని పనిచేయడమే మన బాధ్యత అని తిక్కారెడ్డిని అసెంబ్లీకి పంపించే బాధ్యత మనందరం తీసుకోవాలని సూచించారు. వైసిపి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అర్థమయిందని వైసిపి ఎమ్మెల్యేని ప్రజల ఇంటికి పంపిస్తారని పాలకుర్తి తిక్కారెడ్డిని అసెంబ్లీకి పంపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న పట్టాబి :- మంత్రాలయం గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ని పట్టాబి కుటుంబ సభ్యుల తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి కి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేషవస్తరం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, పెద్దకడబూరు మండలం కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్, క్లస్టర్ ఇన్ ఛార్జ్ లు అడివప్ప గౌడు, వెంకటపతి రాజు, ఎల్లారెడ్డి, చావిడి వెంకటేష్, భరద్వాజ్ శెట్టి, కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని రంగన్న, మాధవరం కృష్ణమోహన్ రెడ్డి, వీరారెడ్డి, వట్టేటెప్ప నర్సింహులు, మేకల నర్సింహులు, ఏబు, శివ చిన్న బొంపల్లి నరసింహులు, అశోక్ రెడ్డి, ఆర్ టి ఎస్ కన్వీనర్ దశరధి రాముడు, అబ్దుల్ ,పవన్, తెలుగు యువత మండల అధ్యక్షులు మహాదేవ, అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.