కుర్ణి,నేసేలు..అన్ని రంగాల్లో రాణించాలి
1 min read– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, కుర్నీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు
– చేనేత ల అభివృద్ధికి కృషి చేసే పార్టీలకే మద్దతు ఇస్తానని స్పష్టీకరణ..
కర్నూలు:కుర్నీ, నేసేలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, కుర్నీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు. కర్నూలు శివారులోని వెంకన్న బావి వద్ద కుర్ని ,నేసే కార్తీకమాస వనభోజనం మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు కుర్ని ,నేసే కార్తీక వనభోజనం కమిటీ వారు ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంగం జాతీయ ప్రధాన కార్యదర్శి, కు సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షులు నక్కల మిట్ట శ్రీనివాసులు పాల్గొన్నారు. ముందుగా సంఘం పెద్దలు గోపూజ, ఉసిరి చెట్టు పూజా కార్యక్రమాలను చేపట్టారు.అనంతరం ఏర్పాటు చేసిన సభకు అద్యక్షులు గా గడిగే ప్రసాద్ వ్యవహరించారు.ఈ సభను ఉద్దేశించి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ నేసే , కుర్ని, కులస్తులు ఆర్థికంగా, విద్య, రాజకీయాల్లో అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. సంఘం తరపున చదువులో రాణిస్తున్న పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తామన్నారు. పలు సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కు,నేసే ల అభివృద్ధికి కృషి చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందన్నారు. ఐక్యంగా హక్కుల సాధన కు పోరాడతామని చెప్పారు. కార్తీకమాస వనభోజనం మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు._అనంతరం చిన్నారులు చేసిన ఆలపించిన శివుని భక్తి గీతాలు, చిట్టి పొట్టి చిన్నారులు చేసిన సినిమా పాటల కు చేసిన డాన్స్ కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అనంతరం ముఖ్య అతిధి నక్కలమిట్ట్ట శ్రీనివాసులు గారిని వనభోజనం ఆహ్వాన కమిటీ శాలువా మేమొంటోతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమం లో ఏమ్మిగనురు మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్ట రంగయ్య, కౌన్సిలర్ శివకుమార్, రాష్ట్ర కుర్నీ ఉద్యోగ సంఘం ఉద్యోగ సంఘం అధ్యక్షులు మాదికొండ కృష్ణయ్య నగర సంక్షేమ సంఘం కార్యదర్శి కెపి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు గణపతి నాగరాజు జిల్లా అధ్యక్షులు గుడ్ల నాగేష్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సర్లే ఎల్లప్ప అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మాదిగుండు రామదాసు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు గడిగ జగన్నాథం అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో మహిళలు కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం పాల్గొన్నారు.