బడి బయట కాదు..బడిలోనే ఉండాలి -విద్యార్థులు భారీ ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పిల్లలందరూ బడి బయట కాదు ఉండాల్సింది బడిలోనే ఉండాలని ఎంఈఓ రామిరెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కేజీబీవీ,మోడల్ పాఠశాల విద్యార్థులు ఆయా పాఠశాలల నుంచి మిడుతూరు బస్ స్టాండ్ వరకు విద్యార్థులు మండల విద్యాశాఖ అధికారులు రామిరెడ్డి,శ్రీనాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.విద్యార్థులు ప్ల కార్డులను చేతపట్టుకుని బడి బయట కాదు..పిల్లలందరూ బడిలోనే ఉండాలి అంటూ నినాదాలు చెబుతూ ర్యాలీ చేపట్టారు.బస్టాండ్ కేంద్రంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడిన అనంతరం అధికారులు మాట్లాడుతూ 5- 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా తప్పని సరిగా బడి లోనే ఉండాలని వారిని పాఠశాలలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ప్రతి రోజూ తప్పకుండా ఉండాలని ఎక్కువ రోజులు బడికి వెళ్లకుండా ఇంటిదగ్గర ఉండకూడదని వారు అన్నారు.అదే విధంగా ఎంతో మంది విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉన్నారని అంతేకాకుండా చదువుకోవడం వల్ల వారిలో తెలివి తేటలు మెరుగవుతాయని స్వతహాగా జీవించే విధంగా వారిలో ఉంటుందని బడికి పంపించాల్సిన పిల్లలతో పనులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు అ న్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి తహసిల్దార్ ప్రకాష్ బాబు,పాఠశాలల ఉపాధ్యాయులు సాయి తిమ్మయ్య,సలీం భాష ఎస్ఓ విజయలక్ష్మి,సిఆర్ఎంటి లు రమణ,మౌలాభి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.