తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
1 min readనందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లాకు తుఫాను ప్రభావం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం కావాలని ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ సూచించారు.వాతావరణ శాఖ నంద్యాల జిల్లాను అరేంజ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆర్థర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసి ప్రతి క్షణం ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని సూచించారు. ప్రజలందరూ తుఫాన్ తీవ్రత పట్ల అవగాహన కలిగియుండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ముఖ్యంగా డిసెంబర్ 5 ,6 తేదీల్లో పిల్లలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల తల్లులు, వయో వృద్దులు ఇల్లు విడిచి బయటకు రావద్దన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది గ్రామ సచివాలయం సిబ్బంది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునే విధంగా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్దంగా ఉండాలని కోరారు.