‘నైపుణ్యం’తోనే.. ఉన్నత ఉద్యోగం..
1 min readలయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్
కర్నూలు: కె.వి.ఆర్ జూనియర్ కళాశాల అకౌంట్స్ అండ్ టాక్సేషన్ విభాగపు ఇంటర్మీడియట్ విద్యార్థినులకు నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థ కార్యాలయంలో కంప్యూటర్ ఆఫీస్ మెయింటెనెన్స్ స్కిల్స్ మరియు అకౌంట్స్ ప్యాకేజీ ట్యాలీ తోపాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ నైపుణ్య శిక్షణా ప్రారంభ కార్యక్రమంలో నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యతోపాటు కంప్యూటర్ స్కిల్స్ ,పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, నాయకత్వ లక్షణాల పై శిక్షణ పొంది ఉన్న విద్యార్థులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారన్నారు. కె.వి.ఆర్ కళాశాల జూనియర్ అధ్యాపకులు ఎం.ఏ నవీన్ కుమార్ మాట్లాడుతూ అకౌంట్స్ అండ్ టాక్సేషన్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు .కార్యక్రమంలో అధ్యాపకురాలు రాయపాటి నాగలక్ష్మి ,లయన్స్ క్లబ్ మెంబర్లు , విద్యార్థినిలు, పాల్గొన్నారు.