గ్రామాభివృద్ధికి కృషి
1 min readబెల్డోణ సర్పంచ్ సావిత్రి
పల్లెవెలుగు, చిప్పగిరి
మండల పరిధిలోని బెల్డోణ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆ గ్రామ నూతన సర్పంచ్ సావిత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నరేంద్ర నూతన సర్పంచ్ సావిత్రితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తామన్నారు. గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. అలాగే దౌలతాపురం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఆర్. లక్ష్మి దేవితో గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమాల్లో కుందన కుర్తి నూతన సర్పంచ్ కొండా పురుషోత్తం, నీటి సంఘం అధ్యక్షుడు శీన, సభ్యులు గోవిందు, గోపాల్, ముద్దప్ప, సతీష్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. దౌలతాపురంలో వయసు సర్పంచ్ చంద్రకళ, శేఖన్న, సుధా, బాల గోవిందు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.