నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి
1 min read– ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాబీర్ భాష
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నూతన కళాశాల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ఆలూరు జూనియర్ కళాశాల ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులుగా వినేష్ బాబు కార్యదర్శిగా గాదిలింగ మరియు 21 మంది కమిటీ సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏఐఎస్ఎఫ్ మహిళ కన్వీనర్ గా కళ్యాణి బాయ్ కో కన్వీనర్ గా దీపిక మరియు 11 మంది కమిటీ సభ్యులతో ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షాపూర్ భాషా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ_ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిందని,అందులో భాగంగానే దేశంలో నూతన జాతీయ విద్యావిధానం రద్దు కోసం,పాఠశాలల హేతిబద్దీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించామని, ఉన్నత విద్యకు శాపంగా మారిన జీఓ 77ను రద్దు చేయాలని,జీఓ వలన పీజీ చదివే విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదివితే ఫీజులను ప్రభుత్వం ఇవ్వదని, కేవలం యూనివర్సిటీ లో చదివే విద్యార్థులకు మాత్రమే ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుందని ఇది విద్యార్థులకు నష్టం జరుగుతుందని అన్నారు అదేవిధంగా జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు మధ్యాహ్నం భోజనం దూరం చేసి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు.విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన నిధులను పూర్తిగా చెల్లించకుండా రకరకాల కోరీలు పెట్టి విద్యార్థులకు అరకొరగా చెల్లింపులు చేస్తున్నారు. చివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉచితంగా అందించాల్సిన వైద్య విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని దాని వలన పేద విద్యార్థులు వైద్య విధ్యనభ్యసించే వారు తీవ్రంగా నష్టపోతారని,100%ఉచితంగా వైద్య విద్యలో సీట్లను ఇవ్వాలని,కావున వెంటనే 107,108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు రామంజి ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు సహకారదర్శులు ధనుంజయ్ షాహీద్ ధనుష్ రానా ప్రతాప్ ఏఐఎస్ఎఫ్ కమిటీ సభ్యులకి అంజి మహేంద్ర మంజు మోహన్ భరత్ విని మహిళ కమిటీ సభ్యులు గాయత్రి శ్వేత భాయ్ హరిత సుజాత విద్యార్థిని విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.