ఇన్‌ఫుట్ డీలర్లు..సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి
1 min readఅగ్రికల్చర్ జిల్లా ఉన్నత అధికారిణి వరలక్ష్మి, ఆత్మ డిప్యూటీ పీడీ శ్రీలత,
పల్లెవెలుగు:రైతుల సంక్షేమార్థం… వ్యవసాయ సమాచారాన్ని సాంకేతిక నైపుణ్యంతో ఎప్పటికప్పుడు అన్నదాతలకు అందించడానికి ఇన్పుట్ డీలర్లు కృషి చేయాలని అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి సూచించారు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్‌లో (నందికొట్కూరు 2023–24 బ్యాచ్) శిక్షణ తీసుకున్న ఇన్పుట్ డీలర్లకు మంగళవారం ఆత్మ డిప్యూటీ పీడీ శ్రీలత నేతృత్వంలో అగ్రికల్చర్ జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ఇన్పుట్ డీలర్లు సాంకేతిక నైపుణ్యం మరింత పెంపొందించుకుని.. రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు ఏడీఏ విజయ్ శేఖర్, ఏడీఏసీ, డీఆర్సీ వెంకటేశ్వర్లు, ఆత్మ ఏఓ మధుమతి, రిటైర్డు ఏడీ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.