మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడి వర్కర్లు వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: సిఐటియు. ఆధ్వర్యంలో పాణ్యం మండల కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు అంగన్వాడి వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహం దగ్గర వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడి వర్కర్లకు తెలంగాణ కన్నాఅదనంగా వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల పెంచాలని హెల్పర్ ప్రమోషన్ల నిబంధనలు రూపొందించాలని. రాజకీయ జోక్యం అరికట్టాలని .ప్రమోషన్లు 50 సంవత్సరాలు పెంచాలని సర్వీస్ లో ఉండి చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. బీమా సౌకర్యం కల్పించాలని. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులవారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వయస్సు 62 సంవత్సరాల పెంచాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని .వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ మండల నాయకులు వెంకటమ్మ మాబునిషా. సుబ్బలక్ష్మి. సూర్య ప్రభావతి హైమావతి. ధనలక్ష్మి .శివమ్మ .కవిత .ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రతాప్ శ్రీనివాసరావు ఆటో యూనియన్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.