PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నా తెలంగాణ ప్రజలకు మరియు నాయకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడానికి కృషిచేసిన కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా. రేపు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డికి మరియు ప్రమాణం చేసే అన్ని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి అమానుల్లా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అమానుల్లా మాట్లాడుతూ రాబోయే 2024లో ఆంధ్రప్రదేశ్లో మన అధ్యక్షులైన శ్రీ గిడుగు రుద్రరాజు  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం తేవడం కోసం అందరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోరడమైనది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మన దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ  ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా పై మొదటి సంతకం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుచున్నాను. అదే కాకుండా రైతులకు రైతు రుణాలు మాఫీ నిరుద్యోగులకు గవర్నమెంట్ వచ్చిన వెంటనే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా వెన్నుముక లాంటి రైతుల కోసం ఒక ఎకరానికి రైతు భరోసా కింద 15000 సహాయం చేయడం జరుగుతుంది నిరుపేదలకు సంవత్సరానికి 12,000 సహాయం చేయడం జరుగుతుంది వితంతువులకు వృద్ధులకు పెన్షన్ 4000 చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు హెచ్ పరసప్ప.పిర.సాబ్. నబి సబ్. రజాక్. అల్లా బకాష్ అస్సలామ్. బోయ సిద్దయ్య. బోయ కలప. బోయ సుధాకర్. బోయ రవి. కురువ ఈరన్న. ఎహసాన్. జావీద్. కాజా. రాజా. అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.

About Author