ఘనంగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి..
1 min readపాల్గొన్న ప్రముఖులు, సంఘ నాయకులు, దళిత సంఘాలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా ఏలూరు స్థానిక పాత బస్టాండ్ సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద జై భీమ్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ విప్పర్తి ప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం పూలమాల అలంకరణ, పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ మన భారతదేశానికి రాజ్యాంగం అవసరమని ఎంతోమంది మేధావులు,మహనీయులు ఆలోచనా సరళితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనతో నిర్మించిన రాజ్యాంగం భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నరు. సమాజంలోని దళితులు పీడత వర్గాల స్వతంత్రo తో వారిలో చైతన్యం, ఐక్యత కలిగించినవారు మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ప్రాతిపదికలుగా నవ సమాజ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారన్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బూరి అనిల్ మాట్లాడుతూ అసమానతను రూపుమాపి, మహిళలకు సమాన హక్కు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ షాబ్జి ఎమ్మెల్సీ ఉభయగోదావరి జిల్లా, ఆర్ విజయ రాజు ప్రాజెక్టు డైరెక్టర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, చాగంటి సంజీవ్ రిటైర్డ్ ఐఆర్ఎస్, మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగ రవికుమార్, పత్రికా సంపాదకులు మత్తె బాబి, ఎస్సీ ఎస్టీ సొసైటీ వెల్ఫేర్ జిల్లా ప్రెసిడెంట్ మాణిక్యం, మాల మహానాడు ఏలూరు టౌన్ యూత్ ప్రెసిడెంట్ ఎన్ పద్మారావు, పెనుమాల ప్రవీణ్, సుండ్రు సాంసన్ రాజు, తోమ్మండ్రు రవికుమార్, దాసరి రాట్నాలు బాబు, దోమతోటి జయలక్ష్మి అబ్రహం, పొలిమేర హరికృష్ణ, సొంగ మధు, తుల్లిమల్లి వరప్రసాద్ లింగమూర్తి, తలారి నాగరాజు చైతన్య గోదావరి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ మరియు దళిత సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.