NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల కేంద్రమైన హోళగుంద లో ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఫౌండర్ ప్రెసిడెంట్ సిహెచ్ నాగరాజ దళిత సమైక్య మండల అధ్యక్షులు నల్ల మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత సామాజికవేత్త సంఘ సేవకుడు అంటరాని నిర్మూలన కోసం ఎంతగానో శ్రమించిన మహానుభావుడని గుర్తు చేశారు మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేశారన్నారు అణగారిన కులాల హక్కుల కోసం ఉద్యమించిన మహానేత అన్నారు తన అసమాన ప్రతిభతో భారత రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన దర్శకుడు దిన జన బాంధవుడు భారతరత్న భారతీయుల ముద్దుబిడ్డ అని కొనియాడారు ఈయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు అమీర్ సాబ్, పెద్ద హేట విరుపాక్షి, రవికాంత్, ఈ నాగరాజ్ గౌడ్, గజ్జహళ్లి విశ్వనాథ్, సమతగిరి మంజునాథ్, సాయి బేస్, మధు సర్, వజీర్ భాష, మహేష్ గౌడ్, సమాజ సేవకుడు ఈరన్న బుడగ జంగాల నాయకుడు రామాంజనేయులు, ముగ్గు గోవిందు రామదాసు తదితరులు పాల్గొన్నారు.

About Author