ఆసుపత్రికి అవసరమైన అత్యాదునిక పరికరాలు ప్రారంభం
1 min readకర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు ఇన్ బిల్ట్ మల్టీ మోడ్ వెంటిలేటర్ మరియు మాన్యువల్ అనస్థీషియా బోయాల్స్ ఆపరేటర్ వర్క్ స్టేషన్ (3 BPL) పరికరాల ప్రారంభం గురించి.
ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి మాట్లాడుతూ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఇన్ బిల్ట్ మల్టీ మోడ్ వెంటిలేటర్ మరియు మాన్యువల్ అనస్థీషియా బోయాల్స్ ఆపరేటర్ వర్క్‌స్టేషన్ శస్త్ర చికిత్స (3 BPL) అత్యాధునిక మూడు ఆపరేషన్ పరికరాలను ఓటి (A,B-0T) , మరియు ఎంసిహెచ్ గైనిక్ ఓటి, ప్లాస్టిక్ సర్జరీ ఓటి (D-0T)విభాగాలలో ఈ అత్యాధునిక పరికరాలను (BPL కంపెనీ మెషిన్లను) ప్రారంభించినట్లు తెలియజేశారు.ఆసుపత్రి సర్జికల్ థియేటర్ ఏబీ ఓటి,లో ఈ మిషన్ వల్ల పేషెంట్ కు ఆటోమేటిక్ ఆక్సిజన్ సరఫరా మరియు శ్వాస తీసుకోవడంలో నిమిషానికి ఆక్సిజన్ సరఫరా ఎంత కావాలో ఆటోమేటిక్ గా ఈ మిషన్ జనరేట్ చేయనున్నట్లు తెలిపారు.శ్వాస నాళాలలో ఎంత గాలి మరియు బ్లడ్ ప్రెజర్ కావాలో ఆటోమేటిగ్గా తీసుకునే సదుపాయం ఈ మిషన్ లో ఉండనున్నట్టు తెలియజేశారు.ఇన్ బిల్ట్ మల్టీ మోడ్ వెంటిలేటర్ మరియు మాన్యువల్ వెంటిలేషన్‌తో (BPL కంపెనీ) అనస్థీషియా వర్క్ స్టేషన్ తో మూత్ర నాలాలకు సంభందించిన సర్జరిలలో అనస్థీషియా ఇవ్వడానికి ఈ పరికరం చాలా దోహదపడుతున్నట్లు తెలిపారు.ఈ మిషన్ యొక్క ప్రత్యేకతలు ఒక సంవత్సరం పిల్లలకు కూడా సర్జరీ మరియు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత అవసరమో ఆటోమేటిగ్గా జనరేట్ చేయడానికి ఉపయోగపడునున్నట్లు తెలిపారు.ఇటువంటి ఎక్విప్మెంట్ పరికరాలు కార్పొరేట్ సెక్టార్స్ కూడా చాలా అరుదుగా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరికరాల ద్వారా కాంప్లికేటేడ్ సర్జరీస్ అయిన న్యూరో సర్జరీ, బైపాస్ సర్జరీ చేయడానికి మరియు పేషెంట్స్ కు ఇతర సర్జరీ చేసేటపుడు అనస్థీషియా చాలా స్మూతుగా ఇవ్వడనికి కూడా దోహదపడునున్నట్లు తెలిపారు.ఆసుపత్రికి ఇట్లాంటి పరికరాలు పొందినందుకు కార్పొరేట్ సెక్టార్స్ కు ధీటుగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శస్త్ర చికిత్సలు చేయడానికి వీలు కల్పించినందుకు పలువురు అనస్థీషియా మరియు సర్జన్లు వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.ఆసుపత్రికి అవసరమైన అత్యాదునిక పరికరాలను (HDS) నిధుల ద్వారా కొనుగోలు లో కలెక్టర్ అనుమతులతో కొనుగోలు చేసినట్లు తెలిపారు.ఆసుపత్రికి ఇలాంటి మెషిన్లకు కొనుగోలు చేయడానికి కలెక్టర్ అనుమతులు మంజూరు చేసిన అనంతరం వీటిని తొందరగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలియజేశారు.ఈ మిషన్ల కొనుగోలులో అనుమతులు మంజూరు చేసిన కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డా.హరిచరణ్, ఆసుపత్రి డిప్యూటీ CSRMO డా.హేమనలిని, హెచ్వోడీస్, డా.విశాల, డా.కొండారెడ్డి, డా.సుధీర్, RMO డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.