పల్లెవెలుగు వెబ్ గడివేముల: 5 నుండి 18 సంవత్సరములు గల పిల్లలందరూ పాఠశాలలో నమోదవ్వాలని, ఎవరు కూడా బడి బయట ఉండరాదని, అలాగే తల్లిదండ్రులు పిల్లలను కూలికి పంపకూడదు మరియు 18 సంవత్సరాల లోపు పిల్లలకు ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయరాదని, ఎంఈఓ మేరీ సునీత బిలకలగూడూర్ సచివాలయంలో బుధవారం నాడు వాలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులుని మరియు హజరత్ హుస్సేన్ని మండల అబ్జర్వర్‌గా నియమించారు, వీరు మండల పరిధిలోని అందరూ వాలంటీర్లతో సమావేశమై విద్యార్థులందరూ పాఠశాలలో నమోదు అయ్యారా లేక బడి బయట ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టర్ కి సమర్పిస్తామని. వీరితోపాటు మండల అధికారులు, మండల అభివృద్ధి అధికారి శివ మల్లేశ్వరప్ప పెసర వాయి కరిమద్దుల, తహశీల్దార్ శ్రీనివాసులు గడివేముల, గడివేముల2, ఈ ఒ ఆర్ డి అబ్దుల్ ఖాలిక్ మంచాలకట్ట, గని, ఒoడుట్ల, ఎంఈఓ1 మేరీ సునీత, బిలకలగూడూరు, బూజునూరు, కొర్రపోలురు, ఎంఈఓ 2 విమల వసుంధర దేవి, చిందుకూరు, గడిగరేవుల కొరటమద్ది, దుర్వేసి సచివాలయాల పరిధిలోని అన్ని గ్రామాలలో పరిశీలిస్తారు, ఈ సందర్భముగా తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించాలని ఎంఈఓ మేరీ సునీత ప్రజలను కోరారు.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: స్థానిక ఎంఈఓ కార్యాలయంలో గురువారం నాడు జి ఈ ఆర్ సర్వేపై విద్యా సంక్షేమ సహాయకులతో జరిగిన వర్క్ షాపు నందు, ఎంపీడీవో శివమల్లేశ్వరప్ప మాట్లాడుతూ, గడివేముల మండలంలోని బడి ఈడు పిల్లలందరూ, పాఠశాలలో ఉండే విధంగా చూడాలని, ఇది మీ బాధ్యతగా భావించి, పిల్లలందరి నీ పాఠశాలలో నమోదు చేయాలని, విద్యా సంక్షేమ సహాయకులను సూచించారు. సర్వేలో ఎవరైనా పిల్లలను బడి బయట గుర్తిస్తే…
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పిల్లలందరూ బడి బయట కాదు ఉండాల్సింది బడిలోనే ఉండాలని ఎంఈఓ రామిరెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కేజీబీవీ,మోడల్ పాఠశాల విద్యార్థులు ఆయా పాఠశాలల నుంచి మిడుతూరు బస్ స్టాండ్ వరకు విద్యార్థులు మండల విద్యాశాఖ అధికారులు రామిరెడ్డి,శ్రీనాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.విద్యార్థులు ప్ల కార్డులను చేతపట్టుకుని బడి బయట కాదు..పిల్లలందరూ బడిలోనే ఉండాలి అంటూ నినాదాలు…
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేములలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో నమోదు అవ్వాలని, అలా నమోదైన విద్యార్థులందరూ ప్రతిరోజూ పాఠశాలకు హాజరవ్వాలని, విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా ప్రతి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులు మరియు వాలంటీర్లు కృషి చేయాలని, దీనివల్ల విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక లాంటి…