PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

1 min read

ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మహిళలకు పెన్షన్లను పెంచాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు M.సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం పత్తికొండ పట్టణంలోని 5 వ సచివాలయం దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళా సమైక్య నాయకురాలు సరోజ. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని వైయస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పెన్షన్ 3000 రూపాయలు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ పూర్తి కాలం ముగుస్తున్న 3000 రూపాయలు పెన్షన్ విధానం అమలు చేయలేదని ఆమె విమర్శించారు. పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచాలని అదేవిధంగా వికలాంగులకు ఏడువేల రూపాయలకు పెంచాలని, అదేవిధంగా ఒకే కుటుంబంలో వృద్ధులైన భార్యాభర్తలకు పెన్షన్ అందజేయాలని, మహిళలకు ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. నిరుపేద మహిళలకు చేయూతనిచ్చే విధంగా రుణాలనందించి మహిళల ఆర్థికంగా ఎదిగేలా చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రానున్న ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోలో  ఏడు వేలకు పెంచే విధంగా,50 సంవత్సరాలు నిండిన వారందరికీ  పెన్షన్ సౌకర్యం  కల్పించాలని, వీరి ఆరోగ్య పరీక్షల కొరకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులను ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. పెన్షన్లు పొందుతున్న మహిళలకు అందరికీ  ఆర్టీసీ, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించా లన్నారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సంక్షేమం కోసం కృషి చేయడం లేదన్నారు. మహిళలు ఎక్కడికి వెళ్లినా దోపిడీ,అత్యాచారం, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని  వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు, నిర్వీర్యం చేస్తున్నాయని  వారు విమర్శించారు. మహిళా సమస్యల కోసం,ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నిరంతరం పోరాడుతుందని అన్నారు. వినతి పత్రాన్ని సచివాలయం కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగవేణి లక్ష్మీదేవి, లక్ష్మి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author