హంద్రీనీవా వంతెనకు పగుళ్లు..కుంగిన శ్లాబ్ అడుగు పిల్లర్లు
1 min read– తెలంగాణ గ్రామాల రాకపోకలకు ఇదే ప్రధానం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలంలో బ్రాహ్మణ కొట్కూరు కోళ్ల బాపురం గ్రామాల మధ్య హంద్రీనీవా కాలువ పై ఉన్న వంతెన ప్రమాదభరితంగా మారింది. వంతెన పగుళ్లు ఇచ్చింది. చేరింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కోళ్ల బాపురం గ్రామం తోపాటు పుడూరు, తెలంగాణ గ్రామాల ప్రజలు ఈ వంతెన మీదుగా వెళతారు.ఈ వంతెననే రాకపోకలకు ప్రధానం. ప్రస్తుతం వంతెనకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా గోడల పగుళ్లు ఏర్పడ్డాయి.శ్లాబ్ కింది భాగంలో పిల్లర్లు కుంగిపోయాయి. దీనికి కారణం వంతెనపై భారీ వాహనాలు అధిక బరువుతో రాకపోకలు సాగిస్తున్నాయి. నేషనల్ హైవే 340సి కోసం కోళ్లబాపురం, బ్రాహ్మణ కొట్కూరు గ్రామాల వద్ద మట్టి తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు.రాత్రి పగలు తేడాలేకుండా మట్టిని తరలిస్తున్నారు. దీనితో వంతెనకు పగుళ్లు ఏర్పడినట్లు కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వంతెన కూలిపోతే ప్రజల రాకపోకలు నిలిచిపోయతాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు మండల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.