భద్రత లేని భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రజల ఆస్తులకు భద్రత లేని ఏపీ భూహక్కు చట్టం 27/2023 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ గురువారం పత్తికొండ న్యాయవాదులు ఆర్డీవో రామలక్ష్మి కి వినతి పత్రం సమర్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పార్టీ కొత్తగా భూహక్కుల చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ చట్టం అమలుతో భూములపై యజమాని అభద్రతాభావానికి లోను కావలసి ఉంటుందని అన్నారు. భూములపై హక్కులు కల్పించేందుకు కోర్టుల పరిధి నుండి తప్పించడం మూలంగా టైటిల్ డీడ్ సెటిల్మెంట్ జడ్జిమెంట్ తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుందన్నారు. కావున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు వారి ఆస్తుల హక్కులకు భంగం వాటిల్లకుండా కొత్తగా తీసుకువచ్చిన భూహక్కుల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఎల్లారెడ్డి, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దామోదరాచారి, కోశాధికారి మహేష్, కార్యదర్శి రంగస్వామి, న్యాయవాదులు నారాయణస్వామి, బీ.టి. నాగేష్,బాల భాష ,మధుబాబు, కాశీ విశ్వనాథ్, భాస్కర్, హరికృష్ణ, రాజ వర్ధనగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.