PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర..

1 min read

– ప్రతి ఎన్నికలను కొత్తగానే చూడాలి, ఏదశలోను ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదు..

– సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీస్ అధికారుల శిక్షణా కార్యక్రమం..

– కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జెసి బి. లావణ్యవేణి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్ర అని ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన సెక్టార్ ఆఫీసర్లు మరియు సెక్టార్ పోలీస్ ఆఫీసర్లు శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జెసి బి. లావణ్యవేణి పాల్గొన్నారు.  ఈ సందర్బంగా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందస్తుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు.  ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ప్రధానమైనవన్నారు. ప్రతి ఎన్నికలను కొత్తగానే చూడాలని ఏదశలోను ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.   ఒకో సెక్టార్ అధికారికి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాల పరిధి వుంటుందన్నారు.  సెక్టార్ అధికారులకు ఎన్నికల సమయంలో పోలింగ్ కు వారం రోజుల ముందు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.  సెక్టార్ అధికారులు తమ పోలింగ్ పరిధిలోని తమ పోలింగ్ కేంద్రాలను సందర్శించి వసతులను, ఓటర్లకు అనుకూలతలను పరిశీలించాలన్నారు.  తమ పరిధిలో సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్  వాస్తవ పరిస్ధితులు ఎలా ఉన్నాయో పరిశీలించాలన్నారు.  గ్రామాల్లో ఆయా వర్గాలతో సమావేశాలు నిర్వహించి సమస్యలపై చర్చించాలన్నారు. సమావేశ అనంతరం అక్కడ దృష్టికి వచ్చిన అంశాలకు సంబంధించిన నివేదికను అందజేయవలసియుంటుందన్నారు. సెక్టార్ ఆఫీసరు పరిధిలో పోలింగ్ స్టేషన్ లో గత ఎన్నికలలో జరిగిన్ సంఘటనలకు సంబంధించి పూర్వపరాలను తెలుసుకోవాలన్నారు.  సెక్టార్ ఆఫీసర్లు తమ నివేదిక ఇచ్చే ముందు అన్ని కోణాల్లో పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గత రెండు సాధారణ ఎన్నికల్లో ఓటర్ టర్నవుట్ , ఎంసిసి ఉల్లంఘన కేసులు,  ఒలనరేబిలిటీ, మ్యాపింగ్, రూట్ మ్యాప్ లు పరిశీలించాలన్నారు. అదే విధంగా గత ఎన్నికల్లో రీపోల్ జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మత్తు పదార్ధాలు సరఫరా, ఎన్నికల వ్యయం సంబంధించిన అంశాలను కూడా గుర్తించాలన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్లో ఓటర్లసంఖ్య ఏ నియోజకవర్గం, ప్రస్తుత సమస్యలు, సెక్టార్ మ్యాప్ పరిశీలించుకోవాలన్నారు.  ఎన్నికలకు ప్రధానంగా ఎలక్ట్రోరల్, ఈవిఎం, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ సిబ్బంది కీలకమన్నారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పరిశీలన జరుగుతున్నదని, తుది ఓటర్ల జాబితా 2024 జనవరి 5న ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈవిఎంలు పస్ట్ లెవల్ చెకింగ్ కూడా పూర్తి అయిందన్నారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి మాట్లాడుతూ సెక్టార్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగియుండాలన్నారు. ఎన్నికల సజావుగా నిర్వహించడంలో సెక్టార్ అధికారుల పాత్ర ముఖ్యమన్నారు.  తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగియుండాలన్నారు.  శిక్షణా సామాగ్రి, చేయాల్సిన, చేయకూడని, చెక్ లిస్టు, హ్యండా బుక్ లను అందించడం జరిగిందన్నారు.  తమ పోలింగ్ స్టేషన్ల ను సందర్శించి ఓటర్లకు పోలింగ్ సిబ్బందికి వసతుల విషయంపై లోటుపాట్లు గుర్తించి తెలియజేయాలన్నారు.  సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లు కు వారు నిర్వర్తించవలసిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్ ట్రైనీలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆయా అంశాలపై సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఆర్డిఓలు, ఎన్ ఎస్ కె ఖాజావలి, కె. అద్దయ్య, డిఆర్ డిఏ పిడి డా. ఆర్. విజయరాజు,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జివివి సత్యనారాయణ,కె. గీతాంజలి, బాబ్జి, నగరపాలక కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, ఏలూరు తహశీల్దార్ బి.సోమశేఖర్,  సెక్టార్ అధికారులు మరియు సెక్టార్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

About Author