ఆశా వర్కర్ల కు ఇచ్చిన హామీని మరచిన జగన్ ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించి వారినీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిఅధికారంలో కి వచ్చాక ఇచ్చిన హామీని మరిచారని ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు రఘురాంమూర్తి అన్నారు. నందికొట్కూరు పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం డిప్యూటీ తాసిల్దార్ సోమేశ్వరి కి ఆశా వర్కర్ల సమస్యలతో కూడినటువంటి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్ల సమస్యలపరిష్కారానికై ఏపీ హెల్త్ (ఆశ) యూనియన్ ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ఆందోళన నిర్వహిస్తున్నారనీ ఆశా వర్కర్లకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 26,000 జీతం ఇవ్వాలని పని భారాన్ని తగ్గించి, ప్రభుత్వ సెలవులు ,మెడికల్ ,వెటర్నరీ లీవులు ఇవ్వాలని రూ. 10 లక్షల గ్రూపు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు, నెలకు పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇళ్లస్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని మరణించిన కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలన్నారు. ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకం ఆశలకు వెయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లను చైతన్యపరిచి ఉద్యమానికి శ్రీకారం చూడతమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీనివాసులు, మహానంది, దినేష్, వినోద్, తదితరులు ఉన్నారు.