PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

1 min read

సెర్ప్-ఉన్నతి మహిళా శక్తి ఆటొ రిక్షా పంపిణీ కార్యక్రమం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

పల్లెవెలుగు  వెబ్​ ఆలూరు:  ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నందు సెర్ప్ ఉన్నతి మహిళా శక్తి ఆటొ రిక్షా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నరాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం లబ్ధిధారులను ఉద్దేశించి మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలు తమకు ఆసక్తి ఉన్న వృత్తులలో రాణించిందేకు ఉన్నతి పథకం చక్కగా ఉపయోగపడుతుందని మహిళలు డ్రైవింగ్ లో ఎలాంటి భయం అంధోళన లేకుండా పురుషులతో సమానంగా రాణించాలని,మగవారికి సైతం కష్టంగా అనిపించే ఆటొ డ్రైవరు వృత్తిని ఎంచుకొని ఆత్మ స్థైర్యంతో ఉండాలని మహిళలను ఉద్దేశించి తెలియజేశారు.ఎస్సీ/ఎస్టీ మహిళల మహిళా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ పథకం కింధ వడ్డీ లేని ఋణాలు ఇస్తున్నారు తీసుకున్న ఋణాలను వాయిదా పధ్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది, ఈ పథకం కింద ఉన్నతి మహిళ శక్తి ఆటొ రిక్షా పేరుతో  గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ – వైస్సార్ క్రాంతి పథం మరియు డి.ఆర్.డీ.ఏ, కర్నూలు వారి ఆద్వర్యంలో పేద ఎస్సీ/ఎస్టి మహిళలకు ఉన్నతి (వడ్డీ లేని ఋణం) పథకం ద్వార ఆసక్తి కలిగి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మహిళలకమొదటి విడత క్రింద పూర్తి ధరలో 90 శాతం మొత్తాన్ని ఋణంగా మంజూరు చేశారు,10 శాతం వాటా ధనం మహిళలు చెల్లించడం జరిగింది. ఋణాము మొత్తం 301650/- మంజూరు చేసి ఆటొ పంపిణీ చేయడం జరిగినది. మహిళలు తీసుకున్న ఋణాలు సక్రమంగా 48 కంతులలో చెల్లించవలెయును.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి ,గుమ్మనూరు శ్రీనివాసులు,ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ ,ఆలూరు మండల కన్వీనర్ వీరేష్,ఆస్పరి సొసైటీ ఛైర్మన్ గోవర్ధన్,మాజీ ఎంపీపీ బసప్ప, పథక సంచాలకులు డి.ఆర్.డీ.ఏ-వైకెపి ఏరియా కోర్దినేటర్ నవీన్  మండల సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి సీత బాయి ,మండల ఎపియం జె.అంజనయ్య, మల్లికార్జున, ధనుజయ,ఉమాపతిసిసి లు, ఉన్నతి మహిళా శక్తి ఆటో డ్రైవరూ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author