ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని సభను విజయవంతం చేయాలి
1 min readరాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభను విజయవంతం చేయాలి..
ఏపీ జెఎసి అమరావతి జిల్లా చైర్మన్ కె రమేష్
ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలి..
స్టేట్ ప్రెసిడెంట్ సవరపు లక్ష్మీకుమారి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ రెవెన్యూ భవన్ లో ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంస్థ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి అమరావతి జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ విజయవాడలో ఈనెల 10వ తేదీన రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జరిగే ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని తెలియజేశారు. విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో ఏపీ జెఎసి అమరావతి అనుబంధ సంఘం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రథమ సభ పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొని సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం రాష్ట్రస్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ సవరపు లక్ష్మి కుమారి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా సమైక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ కార్యవర్గ సభ్యులు యు. అనిల్, కె భాగ్యలక్ష్మి, రామయ్య,తదితరులు పాల్గొన్నారు.