PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌దేళ్ల బాలుడికి ప్రాణాంతకస్థాయి  డెంగ్యూ జ్వరం

1 min read

* ప‌లు అవ‌య‌వాల వైఫ‌ల్యం(MODS).. ప‌డిపోయిన బీపీ

* సైటోకైన్ స్టోర్మ్‌తో(Cytokine storm) దెబ్బ‌తిన్న గుండె ప‌నితీరు

* క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా చికిత్స‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఇటీవ‌లి కాలంలో డెంగ్యూ తీవ్ర‌స్థాయిలో కొత్త తరహాలో విజృంభిస్తోంది. చిన్న‌పిల్ల‌ల్లోనూ దాని దుష్ప్ర‌భావాలు అత్యంత ఎక్కువ‌గా ఉంటున్నాయి. గ‌తంలో కొవిడ్ స‌మ‌యంలో చూసిన త‌ర‌హాలో సైటోకైన్ స్టోర్మ్ లాంటివీ ఇప్పుడు డెంగ్యూలో క‌నిపించ‌డం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం. డెంగ్యూ సోకి.. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ప‌దేళ్ల బాలుడికి క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రిలో విజ‌య‌వంతంగా చికిత్స చేసి, అత‌డి ప్రాణాలు కాపాడారు. ఈ చికిత్స‌ల‌కు నేతృత్వం వ‌హించిన క‌న్స‌ల్టెంట్ పీడియాట్రీషియ‌న్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్ట‌ర్ జి.న‌వీన్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు. “ఎర్ర‌గుంట్ల‌కు చెందిన ప‌దేళ్ల ల‌క్ష్మీగ‌ణేష్ తండ్రి సిమెంటు క‌ర్మాగారంలో ప‌నిచేస్తారు. గ‌ణేష్‌కు డెంగ్యూ జ్వ‌రం రావ‌డంతో బ‌య‌ట వేరే ఆస్ప‌త్రిలో చికిత్సకు అడ్మిట్ చేసారు. కానీ రెండో రోజుక‌ల్లా డెంగ్యూ తీవ్ర‌త పెరిగింది. దాంతో మూడోరోజు బాలుడిని క‌ర్నూలులోని కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అత‌డికి బీపీ(BP) చాలా తక్కువకు పడిపోవటంతో అతన్ని పీఐసీయూలో(PICU) చేర్చుకుని దాన్ని త‌గిన స్థాయిలో ఉంచేందుకు చాలా లీట‌ర్ల సెలైన్, ఆల్బుమిన్ వాడాల్సి వ‌చ్చింది. సాధార‌ణంగా మ‌నుషుల ర‌క్తంలో 50% నీరు ఉంటుంది. గుండె సాయంతో ర‌క్త‌నాళాల్లో ర‌క్తం ప్ర‌వ‌హిస్తుంది. కానీ డెంగ్యూ వ‌చ్చిన‌ప్పుడు ర‌క్త‌నాళాల్లోంచి నీరు లీక్ అవుతుంది. అందువ‌ల్ల ర‌క్త‌పోటు (బీపీ) ప‌డిపోతుంది. లీకైన నీరు ఊపిరితిత్తుల్లో చేరి.. ఊపిరి అంద‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఉద‌రంలో చేరి ఉద‌రం వాపు వ‌స్తుంది, మూత్ర‌పిండాల మీద ఒత్తిడి పెరిగి, అవి పాడ‌వుతాయి. ల‌క్ష్మీగ‌ణేష్ విష‌యంలో ఈ లీకేజి బాగా తీవ్రంగా ఉండ‌టంతో బీపీ బాగా ప‌డిపోయింది. అలాగే లీక్ అయిన నీరు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల ఆయాసం పెరిగి ఊపిరి అందలేదు, అందువల్ల వెంట‌నే మెకానిక‌ల్ వెంటిలేటెర్  అమ‌ర్చాల్సి వ‌చ్చింది. వీటితో పాటు అతనికి కాలేయం(లివర్) బాగా దెబ్బతినింది, అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువగా పెరిగిపోయింది, అలాగే ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం త‌గ్గిపోయి నోట్లో మరియు ముక్కులో నుండి రక్తం కారింది, గుండె ప‌నితీరు దెబ్బతింది. సైటోకైన్స్ స్టోర్మ్ కారణంగా ఈ సమయస్యలు తలెత్తుతాయి. ఒక అవయవం కంటే ఎక్కువగా దెబ్బతింటే దాన్ని MODS(మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్) అని అంటారు. రక్త పరీక్షలలో లాక్టేట్, ఫెర్రిటిన్, క్రియాటినిన్, ప్రాణాంత‌క‌మైన మెట‌బాలిక్ యాసిడోసిస్ ఉన్నట్టు తెలిసింది.వైద్యంలో భాగంగా సెలైన్, అల్బుమిన్, ఐనొట్రోప్స్, 5 రోజుల పాటు ఇమ్యునోమాడ్యులేట‌రీ థెర‌పీ, పెరిటోనియ‌ల్ డ‌యాల‌సిస్ చేసి, మ‌రో రెండు రోజులు హీమోడ‌యాల‌సిస్ కూడా చేయాల్సి వ‌చ్చింది. ఎప్పటికప్పుడు అతనికి ఎంత సెలైన్ అవసరం, ఎలాంటి ఐనొట్రోప్ అవసరం తెలుసుకోవడం కోసం ఆల్ట్రాసౌండ్ తో ఇంటెన్సివిస్ట్ డా. నవీన్ రెడ్డి స్కాన్ చేసి చూసుకొని ట్రీట్మెంట్ మార్చుకున్నారు. నిదానంగా అతను కోలుకుంటుండ‌గా అత‌డికి ర‌క్తం విష‌పూరితంగా (సెప్సిస్‌ ఇన్ఫెక్షన్) మారింది, వీటికి త‌గిన సమయం లో తగిన యాంటీబ‌యాటిక్స్ వాడటం వలన అతను కోలుకున్నాడు. సాధార‌ణంగా ఇలా ప‌లు అవ‌య‌వాలు విఫ‌ల‌మైన రోగుల్లో దాదాపు స‌గం మంది(50%) మ‌ర‌ణిస్తారు. అయితే పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టు డా. నవీన్ రెడ్డి ఆధ్వరంలో తోటి ఇంటెన్సివిస్ట్ లు డా.వాసు, డా.రవి మరియు న‌ర్సింగ్ సిబ్బంది(అనూష అండ్ టీం) కూడా బాబును కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన వైద్యం అందించడంతో మూడు వారాల త‌ర్వాత పూర్తిగా కోలుకున్నాడు. మొద‌ట్నుంచి త‌ల్లిదండ్రులు కూడా చాలా ఓపిక‌గా, నమ్మకంగా  ఉండ‌టం కూడా చికిత్స‌కు వీలు క‌ల్పించింది. “ఒక ర‌కమైన వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే డెంగ్యూ వ్యాధి కొంతమందిలో తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా రెండోసారి డెంగ్యూ వ‌స్తే ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. ఇది సాధార‌ణ జ్వ‌రం స్థాయి నుంచి ర‌క్త‌పోటు ప‌డిపోయి, కాలేయం దెబ్బ‌తిని, ప‌లు అవ‌య‌వాల వైఫ‌ల్యం సంభ‌వించే వ‌ర‌కు ఉంటుంది. స‌మ‌యానికి స‌మ‌స్య‌ను గుర్తించి, స‌రైన చికిత్స అందించ‌డం చాలా ముఖ్యం. ఒక్కోసారి కాలేయం కూడా మార్చాల్సి రావ‌చ్చు” అని డాక్ట‌ర్ న‌వీన్ రెడ్డి తెలిపారు. ప్ర‌స్తుతం అన్ని ర‌కాల వ్యాధులు తీవ్రంగా వ‌స్తుండ‌టం, దీర్ఘ‌కాలం పాటు ఐసీయూలో ఉంచి చికిత్స‌లు చేయాల్సి వ‌స్తుండ‌టంతో ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వైద్య‌బీమా చేయించుకోవడం చాలా అవసరం అని ఆయ‌న సూచించారు.

About Author