PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకముందే  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగాక కాదు.. జరగకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సమావేశంలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన  చర్యలపై కలెక్టర్ మాట్లాడారు ..సమావేశంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సభ్యులుగా ఉన్న జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ , ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రత పరంగా  చేయాల్సిన తనిఖీలను తేలిగ్గా తీసుకోకూడదన్నారు…ఒక చిన్న నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలు పోయేందుకు కారణం కాకుండా చూసుకోవాలని తెలిపారు..జిల్లాలో పెద్ద పరిశ్రమలు ఎక్కువ లేవు.. ఉన్న కొన్ని పరిశ్రమల ద్వారా ప్రాణ నష్టం, ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.. ప్రమాదాలు జరగకుండా ముందుగా నిరోధించడానికే   డిస్టిక్ క్రైసిస్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని, జరిగాక మేనేజ్ చేయడానికి కాదని కలెక్టర్ స్పష్టం చేశారు..పరిశ్రమల్లో తీసుకోవాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను తప్పనిసరిగా పాటించాలన్నారు. తనిఖీలు చేసి చెక్ లిస్టు ప్రకారం అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా  పరిశీలించాలన్నారు..తనిఖీ వివరాలు  నమోదు చేసే అధికారాన్ని ఇతరులకు బదలాయించకూడదని కలెక్టర్ ఆదేశించారు ..సంబంధిత అధికారులే బాధ్యత తో తనిఖీ వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిశ్రమల్లో లీక్ డిటెక్షన్ వ్యవస్థ సక్రమంగా ఉందా, రెస్క్యూ ప్లాన్,ఎమర్జెన్సీ ప్లాన్, క్రైసిస్ ప్లాన్, యాక్సిడెంట్  ప్లాన్ వంటివి  ఉన్నాయా లేదా  తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు .. అనుకోని ప్రమాదాల వల్ల మనం కూడా బాధితులయ్యే అవకాశం ఉంటుందనే భయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.. పరిశ్రమలు, బాయిలర్స్, ఫ్యాక్టరీస్ తదితర శాఖలు వారి పని వారు చేయాలని సూచించారు..అనుకోని ప్రమాదాలు జరిగినపుడు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దగ్గరలోని పోలీస్ స్టేషన్, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్ తదితర వ్యవస్థలను మ్యాపింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఐ.నారాయణ రెడ్డి  మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు.. రాష్ట్రస్థాయి క్రైసిస్ గ్రూప్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.అదే రీతిలో ఈ నెల 21వ తేదీన గొందిపర్ల వద్ద నున్న  ఆల్కలీ పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సమావేశంలో ఆర్డీఓ హరిప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ముని ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఆర్టీఓ రమేష్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామగిడ్డయ్య, పరిశ్రమల యాజమాన్యాలు,  తదితరులు పాల్గొన్నారు.

About Author