దేవరగట్టులో ప్రత్యేక పూజలు
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం దేవరగట్టులో వెలసినమాళమల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసం నాల్గవ ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి, అమ్మవారికి జలాభిషేకం, ఆకుపూజ, మహా మంగళహారతి వంటి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు మెట్లకు పసుపు రాస్తూ గట్టుకు చేరుకున్నారు. స్థానిక భక్తులతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ఆవరణలో భక్తులు దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు.