ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: తుగ్గలి మండలంలోని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ల ఆధ్వర్యంలో సోమవారం తుగ్గలి మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమo ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్, ఏఐవైఎఫ్ తాలూకా ప్రధాన కార్యదర్శి హనుమేష్, పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తొలి మండలంలోని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లకు అంత భవనాలు లేక విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిలో నేర్పడ్డాయన్నారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా అడుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అద్దె భవనంలో అరకొర సౌకర్యాలతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు తెలిపారు. కనీసం తాగునీటి వసతి, రాత్రిపూట పడుకోవడానికి సరైన వసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని అన్నారు. అలాగే హాస్టల్ భవనాలకు నెలకు 20 వేల రూపాయలు అద్దె చెల్లించలేక వార్డెన్లు వార్డెన్లు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున ఇప్పటికైనా సంక్షేమ హాస్టలకు సొంత భవనాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించి, మెరుగైన విద్యను అందించాలని సంబంధిత జిల్లా అధికారులను కోరారు. అలాగే హాస్టల్లో పురుషులతోపాటు స్త్రీ వంట మనుషులను కూడా నియమించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల అధ్యక్షులు చిరంజీవి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మోహన్, రాము, రంగస్వామి, సుల్తాన్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.