అభివృద్ధే ధ్యేయంగా జగన్ పాలన
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని చెట్నేహళ్లి గ్రామంలో ఏపీ వై నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో లబ్దిదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన వెల్ఫేర్ స్కీం డిస్ప్లే బోర్డ్ ను ఆవిష్కరించారు. అనంతరం వలంటీర్లకు కిట్లు పంపిణీ చేసి వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ 21 కోట్ల 67 లక్షల 96 వేల 111 లబ్ది చేకూరుతుందని తెలిపారు. కనుక ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు గ్రామ నాయకులు జి. భీమారెడ్డి కి పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజిని, ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు, మాజీ సర్పంచ్ లు గంగుల వెంకటేష్, కురువ అల్లింగప్ప, నాగేంద్ర, నర్సింహులు, సచివాలయ సిబ్బంది, పోలీసు శాఖ వారు, గృహ సారధులు, వలంటీర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.