కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక.. ఏంటో తెలుసుకోండి !
1 min readపల్లెవెలుగు వెబ్: నో యువర్ కస్టమర్ (కేవైసి) వెరిఫికేషన్ పేరుతో ఆన్ లైన్ లో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ తన కస్టమర్లను హెచ్చరించింది. కొందరు మోసగాళ్లు ఎస్బీఐ ఉద్యోగిగా మెసేజ్ లు పంపుతూ కస్టమర్ల వివరాలు తెలుసుకేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్బీఐ ట్విట్టర్ లో పేర్కొంది.
సూచనలు :
- ఏదైనా లింక్ ను క్లిక్ చేసే ముందు ఆలోచించండి.
- కేవైసీ అప్ డేట్ కోసం బ్యాంక్ ఎలాంటి లింక్ పంపించదని గుర్తించండి.
- మీ మొబైల్ నంబర్, ఇతర వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
ఇలా రిపోర్ట్ చేయండి :
తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండా ఎలాంటి బ్యాంకు లావాదేవీలు జరిగినా.. బ్యాంకుకు కంప్లైంట్ చేయాలి. ఇలాంటి లావాదేవీలు గుర్తించిన వెంటనే కింది నంబర్లకు 1800 425 3800, 1800 112 211 సమాచారం ఇవ్వాలి.