తుఫాన్ దాటకి ..నష్టపోయిన రైతులు అధైర్యపడకండి…
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు : మీచాన్ తుఫాన్ దాటకి పంట పొలాలు నీటిలో మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారంలో కురిసిన తుఫాను కారణంగా వరి పంటలు నీటిలో మునిగాయి. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం లో అమ్మపాలెం, కొప్పాక ,భోగాపురం, పెనకాడమీ, గ్రామాల్లో వరి పైరు అధిక స్థాయిలో దెబ్బతింది. కోసిన పలను నీటిలో తేలియాడడంతో పంటలు అక్కరకు రావని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన పాడైన పంటను పెదవేగి తాసిల్దార్ నాగరాజు, మండల వ్యవసాయ అధికారి ఎం ప్రియాంక ఆయా గ్రామాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందాలని అవసరం లేదని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తాసిల్దార్ నాగరాజు ,వ్యవసాయ అధికారి ప్రియాంక భరోసా కల్పించారు. మండలంలో మొత్తం 6o31 ఎకరాల్లో వ్యవసాయం జరగగా 1000 ఎకరాల్లో వరి కోత పూర్తయిందన్నరు. మిగిలిన పంట కోయటనికి సిద్ధంగా ఉందని ఏవో ప్రియాంక తెలిపారు. ఈదురు గాలులకు వరిచేలు వంగి నీటముడిగాయని నేల వాలిన కంకులు మొలకలు రాకుండా వెంటనే ఉప్పు నీటితో పిచికారి చేయాలని రైతులకు సూచించారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆర్బికే కేంద్రాలకు పంటలను సిద్ధం చేయాలని తెలిపారు.