36 గంటల నిరసన దీక్షను జయప్రదం చేయండి.. సిఐటియు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : ఆశాల సమస్యలను పరిష్కారం కోసం డిసెంబర్ 14, 15వ తేదీల్లో నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగు 36 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయండి. సిఐటియు ఆశ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని పని భారం తగ్గించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే 36 గంటలు నిరసన దీక్షలు వంట వార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్షురాలు చెన్నమ్మ, ఆశ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి కృష్ణవేణి, వారు మాట్లాడుతూ, ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని మంగళవారం నాడు పిలుపునిచ్చారు పని భారం తగ్గించాలని ప్రభుత్వ సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశాల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని ప్రభుత్వమే నియామకాలు జరపాలని అర్హత కలిగిన ఆశాలను కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా గుర్తించాలని ప్రభుత్వ సెలవులు మెడికల్ లీవులు వేతనంతో కూడిన వెటర్నరీ లివులు అమలు చేయాలని ఇల్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోవిడ్ కాలంలో చనిపోయినటువంటి ఆశలకు 10 లక్షలు ఇవ్వాలని మరణించిన కుటుంబాల్లో ఒకరికి ఆశా వర్కర్ గా తీసుకోవాలని రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా డిసెంబర్ 14 15వ తేదీలలో కలెక్టర్ కార్యాలయం ముందు 36 గంటల నిరసన దీక్షలు తో పాటు వంట వార్పు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరి, ఆశాబీ, జయలక్ష్మి, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.