గ్రంథాలయ స్థలంలో.. ఆక్రమణలు తొలగింపు..
1 min readకోర్టు తీర్పుతో తొలగిన గ్రంధాలయ స్థల సమస్య.
- దాదాపు 45 సెంట్ల స్థలం గ్రంధాలయానిదే
- రూ.60లక్షలతో నూతన గ్రంధాలయ భవన నిర్మాణం
పల్లెవెలుగు. నందికొట్కూరు:నందికొట్కూరు పట్టణంలో గ్రంధాలయం స్థలంలో ని ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించే చర్యలు చేపట్టారు. గ్రంధాలయానికి చెందిన 45 సెంట్ల భూమిలో కొంతమంది ఆక్రమించడంతో ఆ శాఖ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నో ఏళ్ళుగా నెలకొన్న సమస్య న్యాయస్థానం తీర్పు తో పరిష్కరించబడింది. గ్రంధాలయం శాఖ కు కోర్టు తీర్పు అనుకూలంగా వెలువడింది. సమస్య పరిష్కారం కావడంతో ఎట్టకేలకు నూతన గ్రంధాలయం భవనం నిర్మాణం కోసం ఆ శాఖ అధికారులు ,మున్సిపల్ అధికారులు మంగళవారం ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపట్టారు. నందికొట్కూరు పట్టణంలోని మిడుతూరు రహదారి పక్కలో ఉన్న పాత గ్రంథాలయ భవనం స్థానం లో రూ.60 లక్షల తో నూతన భవనం నిర్మాణం చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నందికొట్కూరు పట్టణము లో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డితో కలిసి గ్రంధాలయ పాత భవనాన్ని పరిశీలించారు .అనంతరం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా నందికొట్కూరు పట్టణంలో గ్రంధాలయం శిథిలావస్థ లో ఉండటం తో యువకులు, నిరుద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం గ్రంథాలయ శాఖ ద్వారా నూతన భవనానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నూతన గ్రంధాలయం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీపీఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషోర్, కౌన్సిలర్ రావుఫ్, శాప్ జిల్లా కో ఆర్డినేటర్ స్వామీదాసు రవికుమార్, సీపీఐ నాయకులు రఘు రాం మూర్తి, రమేష్ బాబు , లైబ్రరీ అధికారి మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.