ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
1 min readఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని ఏఐటియుసి నంద్యాల జిల్లా అధ్యక్షులు రఘురాంమూర్తి ప్రభుత్వాన్ని కోరారు.నందికొట్కూరు పట్టణంలోని పటేల్ సెంటర్ కేజీ రోడ్ లో ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ఆధ్వర్యంలో బుధవారం ఆటో కార్మికులతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నంద్యాల జిల్లా అధ్యక్షులు వి రఘురాం మూర్తి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ఆటో అండ్ మోటార్ కార్మికులు ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్న డ్రైవర్లకు బ్రతుక రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు .డ్రైవర్ లందరికీ సంక్షేమ బోర్డు చేయాలని అనారోగ్యంతో చనిపోతే ఐదు లక్షలు ప్రమాదంలో చనిపోతే 10 లక్షలు ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేయాలన్నారు. జరిమానాల పెంచే జీవో నెంబర్ 21 ,31 రద్దు చేయాలని డీజిల్ పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజాధనం చేపడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటోలు కొనుగోలుకు ప్రైవేట్ ఫైనాన్స్ వడ్డీలు రద్దుచేసి డ్రైవర్ను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఆటో కార్మికుల జీవనోపాధి లేకుండా ఓలా ఉబర్ నిషేధించి డ్రైవర్ జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆటో కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు శివ ,శివరేష్ ,షేక్షావలి మా భాష ,లోకేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.