PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ బాధిత బీసీలకు రూ.5 లక్షలు

1 min read

– జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్​) ఎంకేవీ శ్రీనివాసులు
ప‌ల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కోవిడ్​ కారణంగా ఇంటి యజమాని లేదా యజమానురాలు చనిపోతే.. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్​బీసీ ఎఫ్​డీసీ నిధుల ద్వారా రూ.5లక్షలు మంజూరు చేస్తుందని జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్​) ఎంకేవీ శ్రీనివాసులు తెలిపారు. ఆ నిధులను స్వయం ఉపాధికి వినియోగించాలని, అందుకు సంబంధించిన వివరాలు ఈ నెల 23 వ తేదీలోపు బీసీ కార్పొరేషన్​ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్​లోని ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేసీ( ఆసరా మరియు వెల్ఫేర్​) మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు వర్తిస్తాయన్నారు. అనంతరం బీసీ కార్పొరేషన్​ ఈడీ శిరీష్​ మాట్లాడుతూ కోవిడ్​తో మరణించిన కుటుంబ యజమాని 18–60 సంవత్సరముల వయస్సు కలిగియుండవలెను. వివరాలను గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా గుర్తించి ప్రతిపాదనలును బీసీ కార్పొరేషన్​కు పంపాలని మండల పరిషత్​ అధికారులు, మున్సిపల్​ కమిషనర్లను ఆదేశించామన్నారు. కుటుంబ సంవత్సరం ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి, తెల్లరేషన్​ కార్డు, ఆధార్​ కార్డు, బ్యాంకు పాస్​ బుక్​, మరణ ధ్రవీకరణ పత్రమలతో సమర్పించాలని ఈడీ శిరీష వెల్లడించారు.

About Author